12 నియోజకవర్గాల్లో 16 మంది టీ‘ఢీ‘పీ ఎమ్మెల్యేలు

తెలంగాణ ఎన్నికలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. నంద్యాల ఉప ఎన్నికల తరహా లో ఇక్కడ కూడా రాజకీయం చేయాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తమ సత్తా ఏంటో చూపించాలని చెబుతున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను హైదరాబాద్‌ను ఎలా అభివృద్ధి చేశానో, సైబరాబాద్‌ను ఎలా తీర్చి దిద్దానో పదే పదే చెబుతూ.. ఆంధ్రా సెటిలర్లు ఎక్కువగా ఉండే ప్రాంతాలపై దృష్టిపెట్టి అక్కడ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. కేవలం ప్రచారంతోనే సరిపెట్టడం కాకుండా వ్యూహరచనలోనూ ఆయన తనదైన శైలి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతిరోజూ టెలికాన్ఫరెన్స్ ద్వారా నేతలను చంద్రబాబు అప్రమత్తం చేస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో ఎలాంటి వ్యూహాన్ని అమలుచేశారో.. ఇక్కడా అదే తరహా విధానాన్ని అమలు చేస్తున్నారు. మొత్తం అన్ని నియోజవకర్గాల నుంచి రోజూ అప్‌డేట్స్ తెప్పించుకుంటు…

Read More

ఇక డాలర్ డ్రీమ్సేనా…

డాలర్ డ్రీమ్స్‌తో అవెురికా వెళ్లాలనుకునేవారికి చేదువార్త. హెచ్-1బి వీసాలు ఇక అంత ఆషామాషీగా వచ్చే అవకాశం లేదు. అత్యంత నైపుణ్యం ఉన్నవారికి.. లేదా బాగా పెద్ద జీతాలు ఉండేవారికి మాత్రమే ఆ తరహా వీసా లు రావడానికి ఇక మీదట వీలుంటుం ది. ఈ దిశగా ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బి వీసాల దరఖాస్తు విధానంలో సరికొత్త మార్పు చేర్పులు చేయనుంది. భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఎక్కువగా కోరుకునే హెచ్-1బి వీసాల దరఖాస్తు విధానంలో మార్పులు చేయాలని ట్రంప్ సర్కారు ప్రతిపాదనలు చేసింది. దీని ప్రకారం హెచ్-1బి వీసాలు కావాలనుకునే కంపెనీలు ముందుగానే ఎలక్ట్రానిక్ పద్ధతిలో తమ పిటిషన్లను రిజిస్టర్ చేసుకోవాలి. వీటన్నింటిని బట్టి చూస్తే బాగా నైపుణ్యం ఉన్న, ఎక్కువ జీతాలు వచ్చేవారికి మాత్రమే హెచ్-1బి వీసాలు వచ్చేందుకు ఇక మీదట వీలుంటుంది. చాలావరకు భారతీయులు, చైనీయులే…

Read More

సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న 2.0

నవంబర్ 29 న వరల్డ్ వైడ్ గా రజిని 2.0 రిలీజ్ అయి సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. మొదటి వీకెండ్ ముగిసేసరికి ఈసినిమా నిలబడగలిగింది. శని..ఆదివారాల్లో ఈసినిమా వండర్స్ క్రియేట్ చేసింది. కేవలం ఆదివారం ఒక్క రోజే తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిది కోట్లకి పైగా షేర్‌ వసూలు చేసింది. నాలుగు రోజుల్లో ఈసినిమా 30 కోట్లు షేర్ ను వసూల్ చేసి స్టాండర్డ్ గా ఉంది.తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమా 72 కోట్లు కు కొన్నారు బయర్స్. అంటే ఇంకా సగం కూడా రాలేదు. తొలి వీకెండ్ బాగుంది కాబట్టి ఈ వీక్ కలెక్షన్స్ కూడా బాగుంటాయి అని అంటున్నారు ట్రేడ్ నిపుణులు. సోమవారం నుంచి గురువారం వరకు పీరియడ్‌ని 2.0 స్టడీగా దాటాలి. ప్రస్తుతం పోటీ ఇచ్చే సినిమాలు లేవు కాబట్టి వసూల్ పెరిగే అవకాశముంది.…

Read More

రేపటి సాయంత్రంతో పరిసమాప్తం

న్యూస్ ఇండియా పొలిటికల్ డెస్క్…సిటీబ్యూరో, : శాసనసభ ఎన్నికల మహా సంగ్రామంలో ప్రచార గడువు సమీపిస్తున్నది. బుధవారం సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే ప్రచారం చేసుకోవడానికి సమయమున్నది. దీంతో అభ్యర్థులకు మంగళ, బుధవారం రెండు రోజులు మాత్రమే ఓటర్లను కలుసుకునే అవకాశమున్నది. అభ్యర్థుల తరపున ప్రచారంతో పాటు బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహించుకోవడానికి కూడా అంతే సమయం ఉంది. దీంతో ఒక్క క్షణం కూడా వృథా చేయకుండా ప్రచారంలో మునిగితేలుతున్నారు అభ్యర్థులు. నిన్న, మొన్నటి వరకు కాలనీ, డివిజన్లు చుట్టేసిన వచ్చిన వారు ప్రస్తుతం ముఖ్యనేతలతో కలిసి రోడ్ షోలపై దృష్టి సారించారు. అగ్ర నేతలను వెంటబెట్టుకొని ప్రచార జోరును పెంచారు. ఓటర్లను తమ వైపు తిప్పుకునేలా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వేడెక్కిన ప్రచారం.. ప్రచారంలో అభ్యర్థులు పదును పెంచారు. గడిచిన 85 రోజులకు పైగా…

Read More