రేణిగుంట సమీపంలోని … ఘోర రోడ్డు ప్రమాదం ఐదుగురు మృతి..!!

న్యూస్ ఇండియా 24 న్యూస్ నెట్వర్క్…. చిత్తూరు : రేణిగుంట సమీపంలోని మామండూరు వద్ద ఆదివారం తెల్లవారజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కడప నుంచి చెన్నై పౌడర్ లోడ్‌తో వెళ్తున్న లారీను చెన్నై విమానాశ్రయం నుంచి వస్తున్న కారు ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. కువైట్‌ నుంచి భారత్‌కు వచ్చిన గంగాధరం(35)ను చైన్నై విమానాశ్రయంలో రిసీవ్‌ చేసుకున్న ఆయన కుటుంబసభ్యులు స్వస్థలం సికేదిన్నేకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గంగాధరంతోపాటు అతని భార్య విజయమ్మ (30), తమ్ముడు ప్రసన్న (32), ప్రసన్న భార్య మరియమ్మ (25), ప్రసన్న కుమారుడు (18 నెలలు) మృతి చెందారు. ట్రాఫిక్ భారీగా స్థంభించటంతో రేణిగుంట అర్బన్ పొలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు. డిఎస్పి చంద్రశేఖర్, సిఐ శివరాముడు, ఎస్ఐ ఇమ్రాన్ బాషా ఇతర సిబ్బంది…

Read More

కార్తీక మాసం చివరికి వచ్చేసింది… కార్తీక సోమవారం ఇలా చేస్తే?

 న్యూస్ ఇండియా ఆధ్యాత్మికం….శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు. అంటే ఈ సృష్టిలో జరిగే ఏ చర్యకైనా, ఏ కార్యానికైనా శివుని ఆజ్ఞ లేనిదే అది ముందుకు నడవదు. మనకున్న ఎనిమిది దిక్కులకు అష్ట దిక్పాలకుడు శివుడు. నవగ్రహాలకు ఆయనే అధిపతి. ఆ పరమశివుని కరుణ ఉంటే ఎలాంటి గ్రహ దోషమైనా మనల్ని పట్టి పీడించదు. ఆ మహేశ్వరునికి సోమవారం అంటే చాలా ఇష్టం. సోమవారం శివుడి పూజతో అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. ఉమా అంటే మహేశ్వరితో కూడిన వాడైన పరమేశ్వరుడు. సోమవారం ఉమామహేశ్వరులను పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మనకున్న దారిద్ర్యము, సమస్యలు పోవాలంటే శివుడిని ఈవిధంగా పూజించాలి. 1. సోమవారం ముందుగా తలస్నానం చేయాలి. ఆ తరువాత పార్వతీపరమేశ్వరుల పటానికి గంధం రాసి బొట్టుపెట్టి దీపారాధన చెయ్యాలి. పూలు సమర్పించుకోవాలి. తరువాత శివాష్టకం…

Read More

కార్తీకమాసంలోడిసెంబర్ 3 వ తారీఖు ఆఖరి సోమవారం కోటి జన్మల పుణ్యం…

న్యూస్ ఇండియా ఆధ్యాత్మికం…  కార్తీక మాసం అంటే శివునికి చాలా ప్రీతికరమైనది. కుమారస్వామిని కృత్తికలు పెంచటం వలన కార్తీక మాసానికి కార్తీకం అని పేరు వచ్చింది. కార్తీక సోమవారం వ్రతం చేస్తే వెయ్యి అశ్వమేధాలు చేసిన పుణ్య ఫలం దక్కుతుంది. శివునికి ఉన్న తమోగుణాన్ని చంద్రుడు మాత్రమే హరించగలడు. అందువలన కార్తికమాసంలో సోమవారానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. శ్రీమహా విష్ణువుతో సమానమైన దేవుడు,గంగతో సమానమైన తీర్ధం, కార్తీకమాసంలో సమానమైన మాసం లేదని మన పురాణాలు చెపుతున్నాయి. ఈ కార్తీక మాసంలో శివ కేశవులు ఇద్దర్ని పూజిస్తారు. అలాగే శివ కేశవులు ఇద్దరికీ ఈ మాసం ప్రీతికరమైనది. ఈ కార్తీక మాసం ఆధ్యాత్మికంగా చాలా పవిత్రమైనది. కార్తీక మాసం శుక్ల పక్ష పాడ్యమి నుండి పౌర్ణమి వరకు అనేక వ్రతాలను చేసుకుంటారు. కార్తీక మాసం మొదటి రోజు పాడ్యమి రోజు…

Read More

అయోధ్యలో.. అశ్వమేధ యజ్ఞం. ..

న్యూస్ ఇండియా ఆధ్యాత్మికం…  అయోధ్యలో రామమందిర నిర్మాణం పై ఎన్నికలు సమీపించే సమయంలో డిమాండ్ పెరిగిపోతుంది. దీనిపై ఛలో అయోధ్య అనే నినాదంతో కార్యాచరణ ముమ్మరం చేశారు విశ్వవేదాంత సంస్థాన్. దీనిలో భాగంగా నేడు ఢిల్లీ నుండి అయోధ్య వరకు ఆర్.ఎస్.ఎస్ భారీ ర్యాలీ దాదాపు 9 రోజులపాటు నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలోనే అయోధ్యలో అశ్వమేధయాగాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ఈరోజే ప్రారంభమైన యాగం నాలుగు రోజులపాటు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సంస్థాన్ అధికార ప్రతినిధి ఆనంద్ జీ మహారాజ్ మాట్లాడుతూ, రామమందిరం నిర్మాణం కోసం తమ ఆందోళన తీవ్రతరం చేశామని స్పష్టం చేశారు. తమ ఆందోళనలో ప్రజలు కూడాపాల్గొని దానిని ప్రజా ఆందోళనగా మారిపోవడాన్ని ఎవరు అడ్డుకోలేరని ఆయన చెప్పారు.అయోధ్యలో రామమందిర నిర్మాణం తప్పదని, ఇటువంటి పరిస్థితులలో కూడా జాప్యం తగదని ఆయన చెప్పారు. ఆలయ నిర్మాణ…

Read More