“కుల వనభోజనాలకు”జనసేనను దూరంగా ఉంచండి: పవన్

న్యూస్ ఇండియా 24 న్యూస్ నెట్వర్క్..కార్తీకమాసంలో ఆధ్యాత్మిక చింతనతో పాటు నలుగురిని ఒక చోటికి చేర్చేందుకు పెద్దలు ఏర్పరచిన వనభోజనాలు..రాను రాను కుల వనభోజనాలుగా రూపాంతరం చెందాయి. అక్కడ కుల సంఘాల చర్చలతో పాటు రాజకీయ పార్టీలు కూడా ఆయా కులసంఘాల మద్ధతు కోసం ఈ వనభోజనాలను స్పాన్సర్ చేస్తున్నాయి. అయితే ఇలాంటి వాటికి జనసేన పార్టీతో పాటు తనను దూరంగా ఉంచాలంటూ సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. కార్తీక సోమవారం సందర్భంగా ఇవాళ ఉదయం ట్వీట్ చేసిన ఆయన.. “జనసేన నాయకులందరికీ విన్నపం: కార్తీక మాసం వనభోజనాలు మీరు కావాలంటే వ్యకిగతంగా జరుపుకోండి. కానీ, నా పేరు మీద కానీ, జనసేన పార్టీ పేరు మీద కానీ జరపద్దని నా మనవి” అని ఈ ఉదయం తన ట్విట్టర్…

Read More

ఏపీ విద్యుత్ ఉద్యోగులను అభినందించిన మంత్రి కళా..!!

న్యూస్ ఇండియా 24 న్యూస్ నెట్వర్క్….   తిత్లీ సహాయకచర్యల్లో పాల్గొన్న విద్యుత్ శాఖ ఉద్యోగులను ఏపీ మంత్రి కళావెంకట్రావు అభినందించారు. ఈ సందర్భంగా విజయవాడలోని విద్యుత్ సౌధాలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తిత్లీ తుపాన్ బాధితులకు సాయం కింద రూ.7.20 కోట్లను విద్యుత్ ఉద్యోగులు అందజేశారు. ఈ సందర్భంగా కళావెంకట్రావు మాట్లాడుతూ, అధికారులు వేగంగా పనిచేయడం వల్లే త్వరితగతిన విద్యుత్ పునరుద్ధరణ జరిగిందని అన్నారు. ముందస్తు అప్రమత్తతతో ప్రాణ, ఆస్తి నష్టం ఎక్కువ లేకుండా నివారించగలిగామని చెప్పారు. ‘గజ’ తుపాన్ తీరాన్ని తాకే ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని, నాయుడుపేట, తడ, గూడూరు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు కళా వెంకట్రావు సూచించారు.

Read More

TDP announces Candidates first list

THE NEWS INDIA(24 NEWS NETWORK)….Telangana TDP has decided to release the first list of its candidates. According to the reports, out of fourteen names, TDP has reportedly finalized the names of six candidates. Nama Nageswara Rao(Khammam), Sandra Venkata Veeraiah(Sattupalli), Revuri Prakash Reddy(Warangal West), Veerendar Goud(Uppal), Bhavya Anand Prasad(Serilingampally), Peddireddy(Kukatpally) are the candidates, which are likely to be officially released soon. On the other hand, Telangana Congress Incharge Khuntia, TS-PCC Chief Uttam Kumar Reddy have met AICC President Rahul Gandhi and they have been working on other aspects of the party.

Read More

అసలు సమరం నేటి నుంచి… తెలంగాణ ఎన్నికల్లో ముఖ్యమైన రోజులివి!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అసలు ఘట్టం నేటి నుంచి ప్రారంభం కానుంది. నేడు ఎన్నికల నోటిఫికేషన్ గెజిట్ విడుదల కానుంది. మొత్తం 119 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనుండగా, ఎస్సీలకు 19, ఎస్టీలకు 12 నియోజకవర్గాలు రిజర్వ్ అయి ఉన్నాయి. నోటిఫికేషన్ విడుదలైన మరుక్షణం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఇందుకోసం రిటర్నింగ్ కార్యాలయాలను సిద్ధం చేశారు. ఇక నామినేషన్ల స్వీకరణ ఈ నెల 19తో ముగియనుండగా, 20వ తేదీన నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు 22వ తేదీ కాగా, బరిలో మిగిలే అభ్యర్థుల తుది జాబితా అదే రోజున విడుదలవుతుంది. ఆపై డిసెంబర్ 5తో ప్రచారం ముగించాల్సి వుంటుంది. పోలింగ్ డిసెంబర్ 7వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ జరుగుతుంది. ఈ పోలింగ్ లో మొత్తం…

Read More