కీలక బాధ్యతను భుజానికెత్తుకున్న “కేటీఆర్‌ “….

THE NEWS INDIA(TNI 24 NEWS NETWORK)…..ముఖ్యమైన ప్రచార బాధ్యతలను భుజానికెత్తుకున్నారు మంత్రి కేటీఆర్‌. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న నియోజకవర్గాల్లో అభ్యర్థులను గెలిపించేందుకు రంగంలోకి దిగారు. రాష్ట్రంలో సెటిలర్లు ప్రభావం చూపే స్థానాలతో పాటు ఎదురుగాలి వీస్తున్న చోట్లా గెలుపు బాధ్యతలు కేటీఆర్‌కే అప్పగించారు గులాబీ బాస్‌. కేసీఆర్‌ హాజరయ్యే నియోజకవర్గ బహిరంగ సభలతో సంబంధం లేకుండా 60 నియోజకవర్గాల్లో కేటీఆర్ కార్యకర్తలతో భేటీ కానున్నారు తారకరామారావు. ఎక్కడెక్కడ ఎవరు అవసరం.. ఏ ఇష్యూను ఎవరు డీల్ చేయగలరు… ఇలా గెలుపే లక్ష్యంగా వ్యూహ రచన చేస్తున్నారు కేసీఆర్. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు ముఖ్యనేతలకు బాధ్యతలు అప్పగిస్తున్నారయన. అందులో భాగంగా అత్యంత కీలకమైన బాధ్యతలను తన కుమారుడు, మంత్రి కేటీఆర్‌కు అప్పగించారు. పార్టీ గెలుపు క్రిటికల్‌ గా భావిస్తున్న నియోజకవర్గాలతో పాటు సెటిలర్లు ప్రభావితం…

Read More

ఢిల్లీని వణికిస్తున్న……” దీపావళి “

THE NEWS INDIA(TNI 24 NEWS NETWORK)…ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఓ పది రోజుల పాటు అత్యంత ప్రమాదకరంగా ఉంటాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది.నవంబర్ మాసంలో వచ్చే దీపావళి పండుగ నేపథ్యంలో మరింత ఆందోళన నెలకొంది. ఆ రాష్ట్రంలో అత్యంత విషపూరిత వాయువులు మరింత వ్యాపిస్తాయని పేర్కొంటోంది. గత కొంతకాలంగా దేశ రాజధాని ఢిల్లీలో విష వాయువులు అధికంగా వ్యాపిస్తుండడం..కాలుష్యం అధికంగా ఉంటుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీలో పెరిగిపోతున్న కాలుష్యంపై అక్కడి ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నెల నుండి దేశ రాజధాని విషవాయువులు మరింతగా వ్యాపించనున్నాయని తెలుస్తోంది. పటాసులు కాల్చడంతో వచ్చే కాలుష్యం జోడయితే పరిస్థితి మరింత దిగజారనుందని తెలుస్తోంది. దీపావళి రోజు పటాసులు కాల్చడానికి కేవలం రెండు గంటలు మాత్రమే సుప్రీం కోర్టు అనుమతి…

Read More

ఏపీ పోలీస్ లకు తెలంగాణ లో పనిఏమిటి…..కేటీఆర్‌ !!

న్యూస్ ఇండియా పొలిటికల్ డెస్క్….చంద్రబాబు ఏలుబడిలో ఆంధ్రప్రదేశ్ పరువు గంగలో కలిసిపోతోంది. ఏపీ పోలీసులను, ఇంటెలిజెన్స్ సిబ్బందిని చంద్రబాబు రాజకీయం కోసం వాడుకుంటూ వారిని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. ఇప్పటికే ఏపీలో శాంతిభద్రతలు అదుపు తప్పినా పట్టించుకోని ఏపీ ఇంటెలిజెన్స్‌.. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ-కాంగ్రెస్‌ కూటమిని గెలిపించేందుకు వంద మంది సిబ్బందిని హైదరాబాద్‌లో మోహరించింది. ఒక ప్రముఖ పత్రికాధినేత ద్వారా తెలంగాణ ఎన్నికల్లో 500 కోట్లు డబ్బు పంచేందుకు చంద్రబాబు ఆ డబ్బును ఇప్పటికే డంప్‌ చేశారని మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఏపీ పోలీసులు పట్టుబడడం కలకలం రేపింది. ధర్మపురిలో అనుమానాస్పదంగా, మఫ్టీలో తిరుగుతున్న ఏపీ పోలీసులను టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. మావోయిస్టులు రెక్కీ నిర్వహిస్తున్నారేమోనన్న అనుమానంతో తెలంగాణ పోలీసులు వారిని తీసుకెళ్లి గట్టిగా విచారించారు. దాంతో తాము…

Read More

ప్రధాని మోదీపై చంద్రబాబు ఫైర్….

THE NEWS INDIA(24 NEWS NETWORK) * నువ్వు 2002లో సీఎం అయ్యావ్.. * నేను 1995లో ఆ బాధ్యతలు చేపట్టా… ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితి దృష్ట్యా 2014లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ప్రకటించారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తారన్న నమ్మకంతో బీజేపీతో చేరామనీ, కానీ తమకు నమ్మకద్రోహం చేశారని ఆరోపించారు. విభజన హామీలు అమలు చేయాలనీ, ఏపీని ఆదుకోవాలని కోరుతూ తాను 29 సార్లు ఢిల్లీకి వచ్చానని చంద్రబాబు గుర్తుచేశారు. ఢిల్లీలోని కాన్ స్టిట్యూషన్ క్లబ్ లో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఎన్డీయే ప్రభుత్వంలో తాము కలిసి ఉన్నప్పటికీ, టీడీపీని దెబ్బతీసే ప్రయత్నాలు చేశారని తెలిపారు. ఇదేం రకమైన రాజకీయ నైతికత? అని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో…

Read More