విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో జగన్‌పై కత్తితో దాడి..!!

THE NEWS INDIA(TNI 24 NEWS NETWORK)…విశాఖపట్నం ఎయిర్‌పోర్టు లాంజ్‌లో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడని సాక్షి టీవీ వెల్లడించింది.దీంతో జగన్‌ ఎడమ చేతికి గాయమైంది. సెల్ఫీ తీసుకుంటానని దగ్గరికి వచ్చిన వ్యక్తి జగన్‌పై దాడి చేసినట్లు సాక్షి తెలిపింది.కోడి పందేల సమయంలో ఉపయోగించే కత్తితో అతను దాడి చేశాడు.దాడి చేసిన వ్యక్తిని ఎయిర్‌పోర్ట్‌లోని ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న వెయిటర్‌ శ్రీనివాస్‌గా పోలీసులు గుర్తించారు.విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ సంఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏపీలో పాదయాత్ర చేస్తున్నారు. 294వ రోజు పాదయాత్ర ముగించుకుని గురువారం ఉదయం విశాఖపట్నం విమానాశ్రయానికి వచ్చారు.ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి ప్రతి శుక్రవారం హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు ఆయన హాజరవుతుంటారు. “దాడి…

Read More

ధర్మ పరిరక్షణ కోసమే బీజేపీలోకి..! స్వామీ పరిపూర్ణానంద..!!

THE NEWS INDIA(TNI 24 NEWS NETWORK)….బీజేపీలో కాషార రంగు రాజకీయాలకు సరికొత్త అర్థాలను చెబుతోంది. ఇప్పటికే బీజేపీలో పలువురు స్వామీజీలు తమ పాత్రను సక్రమంగా నెరవేర్చుస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది సాములోరు కొన్ని రాష్ట్రాలలో అధికారంలో వుండి చక్రం తిప్పుతున్నారు. ఇప్పుడు తాజాగా తెలంగాణ ఎన్నికల సందర్భంగా బీజేపీ మరో సాములోరిని రాజకీయాల్లోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఆయనే స్వామీ పరిపూర్ణానంద. బీజేపీలో చేరి అమిత్ షాతో జరిపిన చర్చల్లో ఎన్నో అంశాల గురించిన ప్రస్తావన వచ్చిందని, తన ఆలోచనలే అమిత్ షా మాటల్లో కనిపించాయని చెప్పారు. తెలంగాణలో ఎన్నికల గురించి, పర్యటన ఎలా ఉండాలనే విషయం గురించి ఇక్కడి నేతలు చెబుతారని అమిత్ షా తనతో అన్నారని పరిపూర్ణానంద చెప్పారు. ఈ సందర్భంగా నేటి ‘రాజకీయం’ గురించి ఆసక్తికర నిర్వచనం చెప్పారు. ‘రా’ అంటే రావణుడు,…

Read More

మజ్లిస్కు కష్టకాలం…

THE NEWS INDIA(TNI 24 NEWS NETWORK)…. –ముగ్గురు సిట్టింగ్‌లపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత  – ప్రచారంలో సహకరించని కార్యకర్తలు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు అవలంభించిన విధానాల వల్ల పార్టీకి దూరంగా ఉన్న కార్యకర్తలు, సీనియర్‌ నేతలను తిరిగి దగ్గరకు చేర్చుకోవాలన్న ఉద్దేశంతో ఫోన్లు చేసి వారిని పార్టీ కార్యాలయానికి పిలిపించుకుని వారిని సముదాయించే పనిలో నిమగమయ్యారు. ఈ ఒక్కసారి వారికి తిరిగి అవకాశం కల్పించాము, గతంలో వ్యవహరించిన తీరే తిరిగి పునరావృత్తం చేస్తే మరోసారి వారికి అవకాశం కల్పించమని, కార్యకర్తలు, సీనియర్‌ నేతలు, ప్రజలతో సత్‌సంబంధాలు కలిగివుండే విధంగా ప్రవర్తన మార్చుకోవాలని వారికి ఆదేశించానని, అయినా వారు అదేతీరు కనబరిచితే ఏంచేయాలో ఆలోచిద్దామని, ఈ ఒక్కసారికి పార్టీ, తనపై ఉన్న నమ్మకం ఉంచి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని అభ్యర్థులను గెలిపించండని వేడుకుంటున్నారు చార్మినార్‌ అభ్యర్థిపై తీవ్ర వ్యతిరేకత…

Read More

త్రివిక్రమ్ తో సెట్స్ పైకి వెళ్లనున్న బన్నీ

‘నా పేరు సూర్య’ తరువాత అల్లు అర్జున్ గ్యాప్ తీసుకున్నాడు. తనని మెప్పించే కథ లభించకపోవడమే అందుకు కారణం. విక్రమ్ కుమార్ ఒక కథ చెప్పినప్పటికీ, సెకండాఫ్ విషయంలో అల్లు అర్జున్ అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనకి ‘జులాయి’ .. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ వంటి హిట్స్ ఇచ్చిన త్రివిక్రమ్ తో మరో సినిమా చేయడానికి బన్నీ తన సంసిద్ధతను వ్యక్తం చేశాడు. ఆల్రెడీ ఆయనకి త్రివిక్రమ్ ఒక కథ వినిపించాడనీ .. అది ఒక హిందీ సినిమాకి రీమేక్ అనే వార్తలు వచ్చాయి. కానీ త్రివిక్రమ్ మాత్రం బన్నీకి కొత్తగా ఒక లైన్ వినిపించి ఓకే అనిపించేసుకున్నాడట. ప్రస్తుతం పూర్తి కథను సిద్ధం చేసే పనిలో వున్నాడని అంటున్నారు. డిసెంబర్లో ఈ సినిమాను లాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది. జనవరి నుంచి రెగ్యులర్…

Read More