రేపు మహిళా రైతు దినోత్సవం సదస్సు..

THE NEWS INDIA(TNI 24 NEWS NETWORK)…వ్యవసాయంలో మహిళల భాగస్వామ్యంపై వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ(ఆత్మ) ఆధ్వర్యంలో మహిళా రైతు దివస్‌(మహిళా రైతు దినోత్సవం)ను పురస్కరించుకుని సోమవారం ఉదయం 10.30గంటలకు స్థానిక అంబేడ్కర్‌ భవనంలో మహిళా రైతులకు సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ పథక సంచాలకులు దొరసాని  ఒక ప్రకటనలో తెలిపారు. సాగులో ఎదురవుతున్న సమస్యలు, ఆధునిక పద్ధతులు, ప్రకృతి వ్యవసాయం, చిరుధాన్యాల సాగు విస్తరణపై ఈ సదస్సులో అవగాహన కల్పిస్తామన్నారు. వ్యవసాయ, అనుబంధ శాఖల్లో అధిక ఉత్పత్తులు సాధించిన పది మంది మహిళా అభ్యుదయ రైతులకు అవార్డులు ప్రదానం చేస్తామని చెప్పారు. మహిళా రైతులు హాజరై సదస్సును విజయవంతం చేయాలని ఆమె కోరారు. అరవింద్ రెడ్డి , రాయలసీమ జోన్ ఇంచార్జ్ .

Read More

ఇక మద్యం హోమ్ డెలివరీ…

THE NEWS INDIA(TNI 24 NEWS NETWORK)…ఆన్ లైన్… ఆన్ లైన్… ఆన్ లైన్… ఆన్ లైన్ కు అలవాటు  పడిన జీవితం …మొబైల్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు.. చివరికి కూరగాయలు, కిరాణ సరుకులు కూడా మన ఇంటికే డెలివరీ అవుతున్నాయి. ఇలా ఈకామర్స్‌ సైట్లలో ఆర్డర్‌ చేయగానే.. అలా అవి మన ఇంటికి వచ్చేస్తుంటాయి. అయితే ఈ జాబితాలోకి త్వరలో మద్యం కూడా చేరిపోనుందట. వినడానికి ఆశ్యర్యంగా అనిపిస్తున్నా ఇది నిజం. మన దేశంలో తొలిసారిగా మహారాష్ట్రలో మద్యాన్ని హోండెలివరీ చేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమచారం. డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు పెరిగి రోడ్డు ప్రమాదాలకు దారితీస్తున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం మద్యాన్ని నేరుగా ఇంటికే సరఫరా చేసేందుకు యోచిస్తోంది. ఇలాంటి చర్య మద్యం పరిశ్రమలో వినూత్న మార్పులు తీసుకురానుందని ఆ రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ సహాయ…

Read More

ఛత్తీస్‌గఢ్‌ రోడ్డు ప్రమాదంలో…ప్రకాశం జిల్లా వాసులు మృతి

THE NEWS INDIA(TNI 24 NEWS NETWORK)…ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని భిలాయ్‌ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. వీరంతా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా వాసులు. భిలాయ్‌ సమీపంలోని దుర్గ గుడి దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వీరు ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొంది. కారులోని నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం మంగలంపల్లికి చెందిన పెద్దమంగయ్య, వెంకటలక్ష్మి, మనీష, మహేందర్‌గా గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు.

Read More

ఎమ్మెల్యే చింతమనేని …ఆకు రౌడీ! సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ !!

THE NEWS INDIA(TNI 24 NEWS NETWORK)…తెలుగుదేశం పార్టీ  ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ రౌడీగా ప్రవర్తిస్తున్నాడని,   అరాచకాలు ఎక్కువయ్యాయని, ఇక చూస్తూ ఊరుకోమని  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హెచ్చరించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు! చింతమనేనిని చూసి ఎందుకు భయపడుతున్నారని, చింతమనేనికి చట్టాలు వర్తించవా అంటూ ప్రశ్నించారు. చింతమనేనిని వెంటనే అరెస్టు చెయ్యాలని, లేకపోతే అమరావతిలో ఆందోళన చేస్తామన్నారు. వారం రోజులకుపైగా మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని అడిగారు. ప్రభుత్వం కార్మికుల సమ్మెలను పోలీసులతో అణిచివేసేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. రాష్ట్రంలో కరువు వల్ల రైతులు అప్పులతో అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్టోబర్‌ 29వ తేదీన అనంతపురంలో కరువుపై కవాతు నిర్వహిస్తామని తెలిపారు. తుఫాన్‌ వల్ల మరణించిన వారికి ఇరవై లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.…

Read More