279 పోలింగ్ కేంద్రాలు.. 20 రౌండ్లు…!!

న్యూస్ ఇండియా 24/7 ఎలక్షన్ స్పెషల్ న్యూస్….  ఇదీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ప్రక్రియ విధానం హుజూరాబాద్, నమస్తే తెలంగాణ: జిల్లా కేంద్రంలో ఎస్సారార్ కళాశాలలో మంగళవారం హుజూరాబాద్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తం 20 రౌండ్లలో పూర్తి కానున్నది. నియోజకవర్గంలో 279 పోలింగ్ కేంద్రాలు ఉండగా, ప్రతి రౌండ్‌లో 14ఈవీఎంల చొప్పున లెక్కింపు అనంతరం ఫలితం వెల్లడవుతుంది. మొదటి రౌండ్‌లో హుజూరాబాద్ మండలంలోని పోతిరెడ్డిపేట, వెంకట్రావుపల్లి, చెల్పూర్, శాలపల్లి, ఇందిరానగర్, సిర్సపల్లి, రాజపల్లి, తోకలపల్లిలు. రెండో రౌండ్‌లో సింగాపూర్, తుమ్మనపల్లి, బోర్నపల్లి, ఇందిరానగర్. మూడో రౌండ్‌లో కొత్తపల్లి, హుజూరాబాద్‌లో కొంత భాగం. నాలుగో రౌండ్‌లో హుజూరాబాద్, రంగాపూర్, రాంపూర్. ఐదో రౌండ్‌లో పెద్దపాపయ్యపల్లి, ఇప్పల్‌నర్సింగాపూర్, దమ్మక్కపేట, కనుకులగిద్దె, జూపాక, ధర్మరాజుపల్లి. ఆరో రౌండ్‌లో కందుగుల, చిన్నపాపయ్యపల్లె, కాట్రపల్లి, వీణవంక మండలం మామిడాలపల్లి, చల్లూర్‌లో కొంత భాగం.…

Read More

అత్యంత భక్తురాలు: రాధాకృష్ణులలో రాధ ఎవరు?

న్యూస్ ఇండియా భక్తి…పశ్చిమ సముద్రతీరములోని ద్వారక రాధికా క్షేత్రమే. ద్వారకలోని పరాశక్తి అంశ రాధ. దాక్షాయణి హృదయము అక్కడ ఉంది. కృష్ణావతారసమయములో ఆమె మానవస్త్రీగా జన్మించినప్పుడు ఆమెలో గోలోక జ్ఞానము ఉన్నది. ఆమె లోకాతీతజ్ఞానముతో పుట్టినది. కృష్ణుడు ఆరాధించినది ఆ పరాశక్తి రూపమైన రాధనే. ఆమె మానవ స్త్రీ గావచ్చి ఆయనతో సాహచర్యము చేసి వెళ్ళినది. ఆమె జ్ఞానాంశ. కృష్ణునితో అభేదము కలిగియున్నది. ఈ ద్వారకా నాథుడు కూడా పరశివ తత్త్వము. కృష్ణుడు ప్రభాస తీర్థములోని సోమనాథుని ఆరాధించాడు. ఆ సమీపములోనే ఆయన మహాపరి నిర్వాణము కూడా జరిగినది. ఆయన లోని విష్ణుతత్త్వము అవతార సమాప్తి కాగానే వైకుంఠమునకు వెడలిపోయినది. శివతత్త్వమే మిగిలిఉన్నది. కృష్ణుడు భూమి మీద అవతరించక ముందే భూలోకములో ఆయనకై వేచియున్న పరాశక్తి రాధ. బ్రహ్మ వస్తువు రూపగుణములులేని నిత్య సత్యము. జగత్తు నిత్యమూకాదు, సత్యమూ…

Read More

శనిదోష నివారణకు ఇలా చేస్తే..?

న్యూస్ ఇండియా ఆధ్యాత్మికం..హనుమంతుడు శనివారం నాడు జన్మించినందున ఆ రోజు హనుమ భక్తులు స్వామివారిని విశేషంగా పూజిస్తారు. పురాణ ఇతిహాసాలు కూడా హనుమంతుని కొలవడానికి శనివారం ప్రశస్తమైనదని పేర్కొన్నాయి. ఈ కారణంగా దేవాలయాలలో ప్రతి శనివారం ప్రాతఃకాలం మూడున్నర గంటల నుండి అర్థరాత్రి దాటాక ఒంటిగంట వరకూ మూయకుండా భక్తులకోసం తెరచి ఉంచుతారు. అలాగే మంగళవారంనాడు సైతం ప్రాతఃకాలం గం. 3-30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ తెరచి ఉంచుతారు. తిరిగి సాయంత్రం 4 గంటలనుంచి రాత్రి 9.00 గంటల వరకూ తెరచి ఉంచుతారు. మిగిలిన రోజులలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 11.30 గంట వరకూ, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకూ భక్తులకోసం తెరచి ఉంచుతారు. శనివారం నాడు వేకువ జామన లేచి స్నానం మాచరించి…

Read More

రైస్ కుక్కర్లో అన్నం వండుకొని తింటున్నారా ?

న్యూస్ ఇండియా 24/7 హెల్త్ న్యూస్ నెట్వర్క్ …..ప్రస్తుత కాలంలో చాలామంది సమయాన్ని అనుగుణంగా మార్చుకోవడానికి కొత్త టెక్నోలజి కి అలవాటు పడ్డారు. టీ పెట్టుకోవడం దగ్గర నుండి అన్నం వండుకోవడం వరకు ప్రతిదానికి ఎలక్ట్రిక్ మిషన్ లను వాడుతున్నారు. చాలామంది అన్నాన్ని రైస్ కుక్కర్ లో వండుకుంటున్నారు. కుక్కర్ లో అన్నం వండుకొని తినే వారు ఈసారి అన్నం పరిమానం, రుచిని ఒకసారి గమనించండి. మరుసటి రోజు అదే బియాన్ని ఒక గిన్నెలో గానీ మట్టితో చేసిన కుండలో కానీ వండండి. అప్పుడు ఆ బియ్యం పరిమానం, రుచిని చూడండి. తిన్న తరువాత రుచిలో గానీ, తిన్న ఆహారం జీర్ణం అవడంలో గానీ తేడా మీకే అర్ధం అవుతుంది. కుక్కర్ కాకుండా మట్టి పాత్రలలో గానీ గిన్నెలో వండుకుంటే కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మూడు…

Read More