ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ అయ్యింది… పెళ్లంటూ బుక్ చేసింది.. గుంటూరు “కిలేడీ లీలలు”

ప్రస్తుతం అంతా ప్రపంచాన్ని స్మార్ట్‌ఫోన్ యుగం శాసిస్తోంది. ఎవరికివారు అర చేతిలో స్మార్ట్ ఫోన్ పెట్టుకొని సోషల్ మీడియాను ఉపయోగిస్తూ ప్రపంచంలో ఏ మూల ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో వీక్షిస్తున్నారు. ఈ ప్రపంచంలో ఎక్కడ ఎక్కడో ఉన్న వాళ్లంతా సోషల్ మీడియా అనే కుగ్రామం తో ఒక్కటై పోతున్నారు. సోషల్ మీడియా అనేది ప్రపంచ సరిహద్దులు చెరిపేసింది. సోషల్ మీడియాను సరిగా వాడుకుంటే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ? అన్ని మైనస్‌లు కూడా ఉన్నాయి. చాలా మంది పోకిరీ అబ్బాయిలు సోషల్ మీడియాలో అమ్మాయిలను వేధించడం ఇప్పటి వరకు చూశాం.. అయితే ఇందకు రివర్స్ సంఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. గుంటూరుకు చెందిన ఓ యువకుడు డిగ్రీ (బీఎస్సీ) చదువుతున్నాడు. అయితే మూడు నెలల క్రితం అతడు అదే జిల్లాలోని వినుకొండకు చెందిన ఓ అమ్మాయి ఫేస్‌బుక్…

Read More

నడకుదురులో వ్యభిచార గృహం పై పోలీసుల ఆకస్మిక దాడి

న్యూస్ ఇండియా 24/7నేషనల్ న్యూస్ నెట్వర్క్….తూర్పు గోదావరి : కరప మండలం నడకుదురు లో వ్యభిచారం నిర్వహిస్తున్న గృహంపై శనివారం తెల్లవారుజామున పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. కరప ఎస్‌ఐ డి.రామారావు బృందం చేపట్టిన ఈ దాడిలో ముగ్గురు విటులతో పాటు ఈ గృహాన్ని నిర్వహిస్తున్న మరో మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో పట్టుబడ్డ ముగ్గురు మహిళలను బాధితులుగా గుర్తించి స్టేషన్‌ బెయిల్‌ పై విడుదల చేయడమే కాకుండా, వారికి కౌన్సిలింగ్‌ నిర్వహించేందుకు ఎస్సై రామారావు ఏర్పాట్లు చేస్తున్నారు. మండలంలో వ్యభిచార గృహాలపై పోలీసులు దాడి చేయడం, నిర్వాహకులు, విటులను పట్టుకోవడం ఇదే తొలిసారి.

Read More

కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన..

న్యూస్ ఇండియా24/7 నేషనల్ న్యూస్ నెట్వర్క్…విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర ప్రాంతంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్‌కు అనుకుని ఉపరితల ఆవర్తనం బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 3.1 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తువరకు కొనసాగుతుందని పేర్కొంది. నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల కోస్తాంధ్ర ప్రాంతంలో విస్తరంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలియజేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయన్నారు. సముద్రతీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని.. మత్స్యకారులు చేపల వేటకు సముద్రానికి వెళ్లద్దని హెచ్చరికలు జారీ చేశారు.

Read More

సహజీవనం చేస్తే పెళ్లి చేసుకున్నట్టే: రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు

న్యూస్ ఇండియా నేషనల్ న్యూస్ నెట్వర్క్ వివాహితతో యువకుడి సహజీవన మంచి ఉద్యోగం రావడంతో మరో యువతిని పెళ్లాడేందుకు యువకుడు సిద్ధం కుదరదన్న హైకోర్టు ఓ మహిళతో కొన్నాళ్లపాటు సహజీవనం చేసి, ఆ తర్వాత మరో యువతిని పెళ్లాడేందుకు ప్రయత్నించిన వ్యక్తికి రాజస్థాన్ హైకోర్టు షాకిచ్చే తీర్పు చెప్పింది. భారతీయ సమాజంలో సహజీవనం చేయడమంటే పెళ్లి చేసుకున్నట్టుగానే పరిగణించాలని అభిప్రాయపడింది. అంతే తప్ప మరోలా భావించడంలో అర్థం లేదని పేర్కొంది. ఓ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న వివాహితతో అదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బలరాంకు స్నేహం కుదిరింది. ఆ తర్వాత అది ప్రేమగా మారి సహజీవనానికి దారి తీసింది. ఆమెను పెళ్లాడతానని బలరాం మాటివ్వడంతో ఉపాధ్యాయురాలు తన భర్త నుంచి వేరుపడి అతడి వద్దకు వచ్చేసింది. అయితే, ఇటీవల బలరాంకు ఐటీలో మంచి ఉద్యోగం వచ్చింది. దీంతో అతడు…

Read More