వాక్సిన్ వికటించి చిన్నారులకు అస్వస్థత.. ఒకరు మృతి

హైద్రాబాద్‌లోని నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్‌లో కలకలం రేగింది, చిన్నారులకు వేసిన వ్యాక్సిన్ వికటించడంతో 15 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఒకరు మృతి చెందగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్‌ లో నెలన్నర, రెండు మాసాల వయసున్న 90 మంది చిన్నారులకు వాక్సిన్ ఇచ్చారు. అయితే అందులో 15 మంది చిన్నారులు వ్యాక్సిన్ తీసుకొన్న తర్వాత అస్వస్థతకు గురయ్యారు. వెంటనే చికిత్స నిమిత్తం వారిని నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. చిన్నారులకు నిలోఫర్ ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. వాక్సిన్ తీసుకున్నవారిలో ఫైజాన్ అనే రెండు నెలల బాలుడు తీవ్ర అస్వస్థతకు గురై నిలోఫర్ ఆసుపత్రిలో మృతిచెందాడు.మరికొందరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. వారికి ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో నిలోఫర్…

Read More

మావోయిస్టుల డంప్‌ స్వాధీనం

న్యూస్ ఇండియా24/7 న్యూస్ నెట్వర్క్…ఒడిశా : నౌపడా జిల్లా పట్‌దారా అటవీప్రాంతంలో స్థానిక పోలీసుల సహాయంతో అక్టోపస్‌ బలగాలు కూంబింగ్‌ నిర్వహించాయి. కూంబింగ్‌లో భాగంగా మావోయిస్టులకు చెందిన ఆయుధాలు, మందు గుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులు పరారీ అయ్యారు. మెయిన్‌పూర్‌ – నౌపడా డివిజన్‌ సీపీఐ మావోయిస్టులకు చెందిన క్యాంపస్‌పై పోలీసులు దాడి చేశారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పట్‌ధార్‌ రిజర్వ్‌ ఫారెస్టు ఏరియాలో పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 3వ తేదీన బలగాలు మావోయిస్టుల క్యాంపుపై దాడి చేయడంతో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మొత్తానికి మావోయిస్టులు పరారీ కావడంతో.. అక్కడున్న డంప్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఐదు టిఫిన్‌ బాంబులు, మూడు యూపీఎస్‌ బ్యాటరీలు, రెండు కేజీల గన్‌ పౌడర్‌, విద్యుత్‌ తీగలు, దుస్తులు, ఎర్ర జెండాలతో పాటు విప్లవ…

Read More

నోయిడా ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం..

న్యూస్ ఇండియా24/7 న్యూస్ నెట్వర్క్(8.30 p.m బులిటిన్)…న్యూఢిల్లీ: ఢిల్లీలోని గ్రేటర్‌ నోయిడాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సెక్టార్‌ 12లోని మెట్రో ఆస్పత్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది అద్దాలు పగులగొట్టి అందులో ఉన్న రోగులను బయటకు తీసుకువస్తున్నారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటల అదుపునకు యత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Read More

రూ.15 లక్షల విలువైన గంజాయి పట్టివేత

న్యూస్ ఇండియా24/7 క్రైమ్ న్యూస్ నెట్వర్క్…..(మోతుగూడెం) ఒడిశా నుంచి భద్రాచలం వైపు కారులో తరలిస్తున్న రూ.15 లక్షల విలువైన వంద కిలోల గంజాయిని మోతుగూడెం పోలీసులు పట్టుకున్నారు. సీఐ దుర్గాప్రసాద్‌, ఎస్సై మనోహర్‌జోషి తెలిపిన వివరాల ప్రకారం…ఒడిశా నుంచి భద్రాచలం పట్టణానికి కారులో గంజాయిని తరలిస్తున్నారన్న సమాచారంతో మంగళవారం సాయంత్రం మోతుగూడెం వెదురు డిపో వద్ద వాహనాల తనిఖీ నిర్వహించారు. సీలేరు నుంచి వస్తున్న కారుపై అనుమానం రావడంతో ఆపి పరిశీలించగా అందులో గంజాయి ప్యాకెట్లు లభించాయి. వాటి విలువ సుమారు రూ.5 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ఒడిశా రాష్ట్రం రాసబెడ గ్రామానికి చెందిన ముదిలి మంగరాజు, దుప్పిలవాడకు చెందిన వంతల మిసాబ్రాను అరెస్టు చేశారు. గంజాయిని స్వాధీనం చేసుకుని కారును సీజ్‌ చేశారు. ఈ తనిఖీల్లో కానిస్టేబుళ్లు సత్యనారాయణ, శ్రీరామ్‌, వీఆర్వో రాజయ్య తదితరులు…

Read More