శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు లో 2 కిలోల బంగారం పట్టివేత…!!

న్యూస్ ఇండియా 24/7 క్రైమ్ న్యూస్ నెట్వర్క్…హైదరాబాద్ నుంచి జైపూర్‌కు తరలించే యత్నం శంషాబాద్: రెండుకిలోల బరువైన బంగారం కడ్డీలను స్మగ్లింగ్ చేస్తున్న రాజస్థాన్‌కు చెందిన వ్యక్తిని ఎయిర్‌పోర్టు కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. శనివారం శంషాబాద్ విమానాశ్రయం నుంచి జైపూర్‌కు బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు యత్నిస్తుండగా నిఘావేసి స్వాధీనం చేసుకున్నారు. నిఘావర్గాల సమాచారంతో శంషాబాద్‌లో ఎయిర్‌పోర్టు కస్టమ్స్ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు.రాజస్థాన్ రాష్ర్టానికి చెందిన రామేశ్వర్ ప్రజాపతి శంషాబాద్ నుంచి జైపూర్‌కు వెళ్లేందుకు విమానాశ్రయానికి చేరుకున్నాడు. విశ్వసనీయ సమాచారంతో అధికారులు అతన్ని పట్టుకొని.. బ్యాగ్‌లో దాచిన ఒక్కటి కిలో బరువున్న రెండు బంగారం కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న రామేశ్వర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. రామ్.. న్యూస్ ఇండియా క్రైమ్ బ్యూరో.,

Read More

సైబర్ నేరగాళ్ల వల.. సుప్రీంకోర్టు న్యాయమూర్తికి తప్పని బెడద

న్యూస్ ఇండియా న్యూస్ నెట్వర్క్…  ఢిల్లీ : టెక్నాలజీ పెరిగిపోయింది. అదేసమయంలో సైబర్ క్రైమ్ సంఖ్య కూడా వీపరీతంగా పెరిగింది. ఈక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకుర్ కు సైతం సైబర్ నేరగాళ్ల ముప్పు తప్పలేదు. ఆయన పేరిట గుర్తుతెలియని వ్యక్తి మెయిల్స్ పంపిస్తుండటం కలకలం రేపింది. సదరు సైబర్ నేరగాడు తనకు తాను జస్టిస్ లోకుర్ నంటూ చెబుతూ కొందరిని ప్రభావితం చేసేలా ప్రయత్నించడం గమనార్హం. సుప్రీంకోర్టు కంప్యూటర్ డిపార్టుమెంట్ డిప్యూటీ రిజిస్ట్రార్ ఈ విషయంపై పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. సైబర్ నేరగాడు ఎవరెవరికైతే మెయిల్స్ పంపాడో వాటి వివరాలు ఆయనకు అందించారు. దీంతో ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసిన పోలీసులు త్వరలోనే నిందితుడిని అరెస్ట్ చేస్తామన్నారు. సదరు నేరగాడికి సంబంధించిన వివరాలు తెలిశాయని తెలిపారు. కుమార్ రాఘవేంద్ర పొన్నూరి. న్యూస్ ఎడిటర్.,

Read More

మహాకూటమి నాయకుడిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి..

 న్యూస్ ఇండియా న్యూస్ నెట్వర్క్… హెలెన్‌ అనే మహాకూటమి నాయకుడిపై 30 మంది టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటన తుకారాంగేట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకున్నది. బాధితుడు హెలెన్‌ వివరాల ప్రకారం పద్మారావునగర్‌లో అత్తగారింటికి వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో ఇంటి వద్ద టీఆర్‌ఎస్‌ నాయకులు కాపుగాచి డబ్బులు పంచుతున్నావని దాడి చేశారని, అలాగే తన కుమారుడిపై దాడికి పాల్పడి కారు అద్దాలు ధ్వంసం చేశారని, ఇంట్లోకి చొరబడి వస్తువులను పగులగొట్టారని తుకారాంగేట్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. అలాగే తార్నాకలో కూడా బీజేపీ నాయకులు డబ్బులు పంచుతున్నారని టీఆర్‌ఎస్‌ నాయకులు బీజేపీ నాయకులపై దాడి చేయడంతో లాలాగూడ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు సమాచారం.

Read More

ఓటేయడానికి గ్రామానికి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. ముగ్గురి దుర్మరణం

ఓటేయడానికి గ్రామానికి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. ముగ్గురి దుర్మరణం

హైదరాబాద్ నుంచి కారులో వెళ్తుండగా ప్రమాదం విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు నల్గొండ జిల్లాలో ఘటన శుక్రవారం జరగనున్న ఎన్నికల్లో ఓటు వేసేందుకు స్వగ్రామానికి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. పెద్ద అడిశర్లపల్లి మండలం పోల్కంపల్లికి చెందిన పోగుల సురేందర్‌రెడ్డి(55), పోగుల యాదమ్మ(50) భార్యభర్తలు. ఐదు రోజుల క్రితం హైదరాబాద్‌లో ఉంటున్న కుమార్తెను చూసేందుకు వచ్చారు. శుక్రవారం ఎన్నికలు జరగనుండడంతో ఓటు వేసేందుకు.. అల్లుడు వెంకట్‌రెడ్డి (35), స్నేహితుడు బొడ్డుపల్లి నర్సింహాచారి, వెంకటరెడ్డి అన్న కుమారుడు మహేందర్ రెడ్డితో కలిసి సురేందర్‌రెడ్డి, యాదమ్మలు కారులో స్వగ్రామానికి బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు కొండమల్లేపల్లి మండలంలోని కేశ్యాతండా వద్ద అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని…

Read More