టాలీవుడ్ నటుడు విశ్వంత్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. అతి తక్కువ ధరకే కార్లను ఇప్పిస్తానంటూ పలువురిని మోసం చేసినట్టు అతడిపై అభియోగాలు నమోదయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. విశ్వంత్ పూర్తిపేరు విశ్వనాథ్. సామర్లకోటకు చెందిన విశ్వంత్.. అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాడు. 2015లో దిల్‌రాజు నిర్మించిన ‘కేరింత’ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టాడు. గతేడాది విడుదలైన ‘ఓ పిట్టకథ’ సినిమాలోనూ విశ్వంత్ నటించాడు. Tags: Tollywood actor, Vishwanth, Actor Cheating case, Banjara Hills
Read MoreCategory: Cinema
తన ఆరోగ్య సమస్యను బయటపెట్టి కంటతడి పెట్టిన నటుడు రానా
తన ఆరోగ్యంపై గత కొంతకాలంగా వస్తున్న వార్తలపై టాలీవుడ్ ప్రముఖ నటుడు రానా స్పందించాడు. నటి సమంత హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘సామ్‌జామ్’ కార్యక్రమంలో పాల్గొన్న రానా తన ఆరోగ్యం గురించి మాట్లాడుతూ.. పుట్టినప్పటి నుంచి తనకు బీపీ ఉందని, దీనివల్ల గుండె సమస్య తలెత్తుతుందని పేర్కొన్నాడు. కిడ్నీలు పాడవుతాయని వైద్యులు చెప్పారని, అలాగే, మెదడులో నరాలు చిట్లిపోవడానికి (స్ట్రోక్ హెమరేజ్) 70 శాతం, మరణానికి 30 శాతం అవకాశం ఉందని వైద్యులు చెప్పారంటూ కంటితడి పెట్టాడు. జీవితంలో వేగంగా ముందుకు వెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా వచ్చిన చిన్న పాజ్ బటన్ ఇదని పేర్కొన్నాడు. రానా కంటతడితో స్పందించిన సమంత.. జనాలు ఏదేదో మాట్లాడుకుంటున్నా, మీరు మాత్రం ధైర్యంగానే ఉన్నారని, ఆ సమయంలో తాను స్వయంగా మిమ్మల్ని చూశానని తెలిపింది. రానాకు కిడ్నీ సమస్య ఉందని, విదేశాలకు వెళ్లి…
Read Moreహీరోగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న ఎన్టీఆర్.. అభిమానుల హడావిడి!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ హీరోగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో ఆయనకు అభిమానుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన ఫొటోలు, కామన్ డీపీను అభిమానులు #2DecadesOfNTREra పేరుతో పోస్ట్ చేస్తున్నారు. నిన్ను చూడాలని సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్.. ఆ తర్వాత స్టూడెంట్ నం.1, ఆది, సింహాద్రి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. యమదొంగ, అదుర్స్, బృందావనం, బాద్షా, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత వంటి సినిమాలతో టాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరిగా వెలుగొందుతున్నాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు.
Read Moreనాగబాబు ప్లాస్మాదానం చేస్తుండగా సర్ ప్రైజ్ చేసిన చిరంజీవి
మెగాబద్రర్ నాగబాబు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన చిరంజీవి చారిటబుల్ ట్రస్టు కార్యాలయంలో జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి సమాచారం లేకుండా వచ్చేసి తన తమ్ముడ్ని సర్ ప్రైజ్ చేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసిన నాగబాబు తన అన్నయ్య సమక్షంలో పుట్టినరోజు జరుపుకుని మురిసిపోయారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి చారిటబుల్ ట్రస్టు సిబ్బంది కూడా పాల్గొన్నారు. కాగా, నాగబాబు తన పుట్టినరోజును పురస్కరించుకుని ప్లాస్మాదానం చేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ, కరోనా నుంచి కోలుకున్న తాను రెండోసారి ప్లాస్మా దానం చేస్తుండగా అన్నయ్య చిరంజీవి సడెన్ గా వచ్చారని వెల్లడించారు. అయితే, తన అన్నయ్య వస్తున్నట్టు తనతో పాటు ఎవరికీ తెలియదని, తాను వస్తున్నట్టు ముందుగా సమాచారం ఇవ్వకుండానే వచ్చేసి తనను ఎంతో సంతోషానికి గురిచేశాడని…
Read More