శరన్నవరాత్రి ఉత్సవాలు : పంచహారతుల విశిష్టత

  న్యూస్ ఇండియా24/7 నేషనల్ న్యూస్ నెట్వర్క్ ….అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపూటమ్మ దుర్గమ్మను కొలవని భక్తులు ఉండరు. దసరా శరన్నవరాత్రి వేడుకల్లో వివిధ అలంకారాల్లో దుర్గమ్మ దర్శనమిస్తుంది. అటువంటి అమ్మవారికి ఇచ్చే హారతి ఎంతో ముఖ్యమైనది. ఒకదాని తర్వాత మరొకటి వచ్చే పంచ హారతులను చూసేందుకు రెండు కళ్లూ సరిపోవు. ప్రధానంగా సాధారణ రోజుల్లో హారతులను చూడాలంటే విజయవాడ దుర్గగుడి అధికారులు భక్తుల నుంచి రెండు వందల రూపాయలు వసూలు చేస్తుంటారు. కానీ దసరా ఉత్సవాల్లో మాత్రం భక్తులను టిక్కెట్ లేకుండా అనుమతిస్తూ.. ఆ అపురూప హారతిని దర్శించుకునే వీలు కల్పిస్తున్నారు ఆలయ అధికారులు. సాయం సంధ్యవేళ నివేదన అనంతరం దుర్గమ్మకు పంచ హారతులు ఇస్తుంటారు. అందులో మొదటగా ఇచ్చేది ఓంకార హారతి. సృష్టికి మూలమైన ఓంకార నాదాన్ని వినడం.. ఓంకార రూపాన్ని చూడడం వల్ల పాపాలు…

Read More

మహాత్మా గాందీ ” మన జాతిపిత “….. ప్రపంచానికే ఆదర్శం

THE NEWS INDIA 24/7 NATIONAL NEWS NETWORK….{SPECIAL STORY}   మహాత్మా గాందీ… ఈ పేరు వింటేనే ఒక్క మన దేశమే కాకుండా యావత్తు ప్రపంచం లేచి నిలబడి మరీ సెల్యూట్ కొట్టేస్తోంది. విద్యార్థి దశ నుంచే తనదైన శైలి అహింసను ఆయుధంగా మలచుకుని గాంధీ కొనసాగించిన ప్రస్థానం నిజంగానే అజరామరమేనని చెప్పక తప్పదు. మన దేశానికి స్వాతంత్య్రం కోసం గాంధీ సాగించిన పోరాటం ప్రపంచ దేశాలకే మార్గదర్శకంగా నిలిచింది. ఏదో జయంతి వర్థంతి సందర్భాల్లో మాత్రమే ప్రస్తావించుకునే స్థాయిని దాటేసిన గాంధీ… నిత్యం యావత్తు మానవాళికి గుర్తుకు వచ్చే గొప్ప పోరాట యోధుడిగా పేరు సంపాదించారు. అలాంటి మహోన్నత వ్యక్తిత్వంతో కూడిన గాంధీ గురించి మనం ఇప్పుడు చాలా ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. అదే గాంధీ 150వ జయంతి వేడుక. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని భారత మీడియాతో…

Read More

వృద్ధులకు 30 నిమిషాల్లో శ్రీవారి ఉచిత దర్శనం…

తిరుమల: తిరుమలలో 60 సంవత్సరాలు దాటిన వయో వృద్ధులకు 30 నిమిషాల్లో ఉచిత దర్శనం చేయించనున్నట్లు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. దీని కోసం రెండు సమయాలు కేటాయించినట్లు వెల్లడించారు. 1) ఉదయం 10 గంటలకు 2)సాయంత్రం 3 గంటలకు ఫోటోతో ఉన్న వయస్సు నిర్ధారణ పత్రాలు తమ వెంట ఉంచుకుని భక్తులు ఎస్‌-1 కౌంటర్‌ వద్ద చూపించాల్సి ఉంటుంది. ఆలయానికి కుడివైపు బ్రిడ్జి కింద కోడ పక్కనే మెట్లు ఎక్కాల్సిన పనిలేదు. కూర్చోవడానికి మంచి సీట్లు ఏర్పాటు చేసి ఉంటాయి. సాంబారన్నం, పెరుగన్నం, వేడి పాలు ఉచితంగా ఇస్తారు. రూ.20కి రెండు లడ్డు టోకెన్లు ఇస్తారు. భక్తులు ఇంకా లడ్డూలు కావాలనుకుంటే రూ.25కు ఒక లడ్డూ ఎన్నైనా టోకెన్లు ఇస్తారు. కౌంటర్‌ నుంచి గుడికి – గుడి నుంచి కౌంటర్‌ వరకు బ్యాటరీ కారులో ఉచితంగా…

Read More

బ్రహ్మోత్సవాల నేపథ్యంలో… ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీ ఒప్పందం!

 న్యూస్ ఇండియా24/7 నేషనల్ న్యూస్ నెట్వర్క్…. ఈ నెల 30 నుంచి తిరుమల శ్రీ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల మధ్య ఒప్పందం కుదిరింది. తిరుపతి రీజనల్ మేనేజర్ కార్యాలయంలో జరిగిన చర్చల తరువాత, భక్తులకు ఎటువంటి ప్రయాణ అసౌకర్యం కలుగకుండా ప్రత్యేక బస్సులు నడిపేందుకు డీల్ కుదిరింది. ఇందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలను టీఎస్ ఆర్టీసీ, ఏపీఎస్‌ ఆర్టీసీ అధికారులు మార్చుకున్నారు. కాగా, బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 8 వరకూ జరగనున్న సంగతి తెలిసిందే. రెండు రాష్ట్రాల మధ్య 150 ప్రత్యేక బస్సులు నడపాలని అధికారుల మధ్య ఒప్పందం కుదిరింది. ఇక ఈ బస్సులను ఏఏ రూట్లలో నడపాలన్న విషయాలపైనా అధికారులు చర్చించారు. ఇక, 18 నుంచి వచ్చే నెల 17వ వరకు పెరటాశి మాసం కావడంతో, తమిళనాడులోని వివిధ ప్రాంతాల…

Read More