సూర్యదేవునికి నైవేద్యం పెట్టడం ఎలా..?

న్యూస్ ఇండియా భక్తి న్యూస్ నెట్వర్క్…సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి జిల్లేడాకులతో, రేగిపండ్లతో మునుగుతూ స్నానం చెయ్యాలి. మునిగేందుకు నీటి ప్రవాహం లేనిపక్షంలో తలమీద, భుజాలమీద ఆకునీ, పండునీ పెట్టుకుని తలమీదుగా స్నానం చేయాలి. సూర్యుడు ఉదయించే దిక్కు తూర్పునకు ఎదురుగా కూర్చోని ఋగ్వేదమంత్రాలనిగాని (ఋగ్వేద మంత్రాలని ఇష్టంగా వింటాడు కాబట్టే ఆయన అర్కుడయ్యాడు). ఆదిత్య హృదయస్తోత్రాన్ని పన్నెండుమార్లు గాని చదువుతూ కూర్చోవాలి. ఇంట్లో గృహిణిగాని, లేదా వివాహం కానివారైతే వారి తల్లిగాని ఆగ్నేయదిక్కులో పొయ్యిని పెట్టి ఆవుపిడకలని ఇంధనంగా వాడుతూ ఆవుపాలతో కొత్తబియ్యంతో పాయసం వండి సూర్యుడు అలా దర్శనమిస్తున్న ఆ మొదటి క్షణంలో ఆయనకి నమస్కరిస్తూ ఈ పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి. నైవేద్యమనేది చివరిగా చేసే వైదికకర్మ కాబట్టి దానికి ముందు లఘువుగా సూర్యునికి ధ్యానం చేసి పూజించాలి.

Read More

సకల దేవగణ తేజోస్వరూపిణి…?

న్యూస్ ఇండియా 24/7 భక్తి న్యూస్ నెట్వర్క్…శివుని తేజస్సుతో ఆమె ముఖపద్మం జనించింది. నిగనిగలాడే ఆమె దీర్ఘ కేశాలు యముని తేజంతో వచ్చాయి. ఆమె నేత్రత్రయం అగ్ని తేజోమయాలు. ఆమె కనుబొమలు ఉభయ సంధ్యల తేజస్సంజనితాలు. ఆ దేవి చౌవులు వాయుదేవుని అంశంలో ఉద్భవించాయి. ఆమె ముక్కు కుబేరుని తేజో జనితం. ప్రజాపతి తేజస్సు నుండి ఆమె పలు వరుస యేర్పడినది. సూర్యుని తేజస్సుతో ఆమె క్రింది పెదవి కుమారస్వామి తేజంతో కల్పితమైంది. విష్ణుతేజంతో ఆ మహాదేవి అష్టాదశ బాహువులు రూపొందాయి. రక్త వర్ణం కల ఆమె వ్రేళ్ళు పసుపుల తోజంతో కల్పింపడినాయి. ఆమె స్తన యుగళం చంద్ర సంభవాలు. మూడు ముడతలు గల ఆమె నెన్నడుము ఇంద్ర తేజస్సంజనితం. కాలి పిక్కలూ, ఊరువులూ వరుణ కల్పితాలు, మొలధాత్రీ తేజం.

Read More

మకర సంక్రాంతి… భోగి పండుగ అంతరార్థం ఏమిటి?

న్యూస్ ఇండియా24/7 భక్తి న్యూస్ నెట్వర్క్…..తెలుగువారు ముఖ్యంగా జరుపుకొనే పండుగలలో సంక్రాంతి చాలా ముఖ్యమైన పండుగ. దీనిని మనం 3 రోజులు జరుపుకుంటాం. వాటిలో మెుదటి రోజైన భోగినాడు వైష్ణవ ఆలయాలలో గోదా కళ్యాణం అనే కార్యక్రమాన్ని పండుగలా జరుపుకుంటారు. అసలు గోదా కళ్యాణం అంటే ఏమిటి. ఇది భోగినాడే ఎందుకు చేస్తారు. ఇది ఎప్పటి నుండి ప్రారంభమైంది. అనేది మనలో చాలామందికి తెలియదు. ఆ గోదా కళ్యాణం ఇతివృత్తమేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.  శ్రీ మహావిష్ణువుకు భక్తులై ఆయనే లోకంగా జీవించి తరించిన మహాభక్తులను ఆళ్వారులు అంటారు. వీళ్లలో ముఖ్యమైన వారు 12 మంది. వీరిలో పెరియాళ్వారు అనే ఆయన శ్రీరంగనాధుడికి మహాభక్తుడు. ఈయన అసలు పేరు భట్టనాధుడు. ఈయనే తరువాతి కాలంలో విష్ణుచిత్తుడిగా ప్రసిద్ధి చెందాడు. విష్ణుచిత్తుడు రంగనాధుడికి ప్రతినిత్యం మాలా కైంకర్యం చేసేవాడు. దీనికోసం…

Read More

ఉత్తరాయణ పుణ్యకాలం అంటే ఏంటి..!

న్యూస్ ఇండియా భక్తి న్యూస్ నెట్వర్క్..ప్రస్తుతం కొనసాగుతున్న ధనుర్మాసం శ్రీమహావిష్ణువు కు అత్యంత ప్రీతికరమైన మాసం కావడంతో ఈనెల అంతా వైష్ణవ ఆలయాలు చాల సందడిగా కనిపిస్తూ ఉంటాయి. సూర్యభగవానుడి సంచారం రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ఉత్తరాయణం – రెండోది దక్షిణాయణం. మనకు ఒక సంవత్సరకాలం దేవతలకు ఒకరోజు అని అంటారు. సంక్రాంతి’ లేదా ‘సంక్రమణం అంటే మారడం అనిభావం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి. పురాణాల ప్రకారం సూర్య భగవానుడు తన కుమారుడైన శని ఇంటికి వెళ్ళడం కోసం వెళ్ళిన రోజును ఉత్తర ఆయనం అంటే ఉత్తరవైపు పయనించడం అని అర్థం. సూర్యుడు పయనించే దిక్కునుబట్టి, దక్షిణం వైపు పయనిస్తున్నప్పుడు దక్షిణాయనం అనీ ఉత్తరం వైపు పయనిస్తున్నప్పుడు ఉత్తరాయణం అని అంటారు. ఉత్తరాయణంలో లయ…

Read More