షుగర్ వ్యాధిగ్రస్తులకు శుభవార్త..!

అవును షుగర్ వ్యాధి ఉన్నవారికి ఇది నిజంగా శుభవార్తే.. ఎందుకంటే.. షుగర్ వ్యాధి తగ్గించుకునేందుకు ఓ మార్గం గురించి ఓ పరిశోధన ఆసక్తికరమైన వార్త తెలిపింది. అదేంటంటే.. టైప్-2 డయాబెటిస్ వ్యాధి నిర్ధరణ తర్వాత తొలి ఐదేళ్లలో 10శాతం శరీర బరువు తగ్గితే వ్యాధి పూర్తిగా నయమయ్యే అవకాశాలున్నాయట. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఈ విషయం కనిపెట్టారు. 40 నుంచి 69 ఏళ్ల వయస్సు ఉన్నవారిపై వీరు పరిశోధన చేశారు. కొత్తగా డయాబెటిస్ బారిన పడ్డ 867 మందిపై పరిశోధన సాగించారు. వారిలో తొలి ఐదేళ్లలో శరీర బరువును 10 శాతం తగ్గించుకున్న 257 మందికి వ్యాధి పూర్తిగా నయమైనట్టు గుర్తించారు. జీవనశైలి మార్పులు, సరైన వైద్యంతో.. టైప్-2 డయాబెటిస్ బారి నుంచి బయటపడొచ్చని జర్నల్ డయాబెటిక్ మెడిసిన్ లో ప్రచురితమైన నివేదిక తెలిపింది. ఎనిమిది వారాలు…

Read More

కమలాలతో ఆరోగ్యం…

 న్యూస్ ఇండియా హెల్త్ న్యూస్ నెట్వర్క్…. శీతాకాలంలో ఎక్కువగా దొరికే పండ్లలో కమలాఫలం ఒకటి. సి విటమిన్‌ని ఎక్కువగా అందించే ఈ పండ్లలో లాభాలు చాలానే ఉన్నాయి.  * ఇందులో ఉండే విటమిన్‌ సి యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది క్యాన్సర్‌ కారకాలను దూరంగా ఉంచుతుంది. ఈ పోషకం వల్ల చర్మం కాంతివంతంగా ఉంటుంది. కాలుష్యం, సూర్యరశ్మి నుంచి చర్మాన్ని కాపాడటంలో ఇది కీలకం. కమలాఫలం నుంచి అందే పీచు జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో మలబద్ధకం దూరమవుతుంది. అజీర్తి సమస్య కూడా ఉండదు.  * గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఈ పండులోని పొటాషియం తోడ్పడుతుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది. కమలాఫలం ద్వారా అందే క్యాల్షియంతో ఎముకల బలహీనత ఉండదు. ఒక పండులో 80 కేలరీల వరకూ ఉంటాయి. కొవ్వు ఉండదు. దీన్ని తింటే అధికబరువుకు దూరంగా…

Read More

కనుమరుగైన రాగి పాత్రలు….

న్యూస్ ఇండియా24/7హెల్త్ న్యూస్ నెట్వర్క్…పూర్వం అందరి ఇండ్లల్లో ఎక్కడ చూసినా రాగి పాత్రలు కనిపించేవి. దాదాపు అవి లేని ఇండ్లు అంటు ఉండకపోయేవి. కాలగమనంలో పద్ధతులు, సంప్రదాయాలు పూర్తిగా మారాయి. ఆధునిక యుగంలో పూర్తిగా రాగి పాత్రలు, గ్లాసులు కనుమరుగైన స్థితి కనిపిస్తోంది. నేడు స్టీల్‌, ప్లాస్టిక్‌ పాత్రలు, గ్లాసులు వాటి స్థానాన్ని భర్తీ చేశాయి. కనుమరుగైన రాగి పాత్రల గురించి, వాటి ఆవశ్యకత గురంచి  తెలుసుకుందాం.    ఆరోగ్యంగా, యవ్వనంగా .. ఆరోగ్యంగా, యవ్వనంగా కన్పించేందుకు ఎటువంటి రోగాలు రాకుండా ఉండాని ప్రతి ఒక్కరూ రాగి చెంబు, రాగి గ్లాసులో తాగే వారు. చాలా మంది క్రమం తప్పకుండా రాత్రంతా నీటిని రాగి చెంబులో నిల్వ ఉంచి, పరిగడుపున తాగే వారు. ఇలా తాగితే కడుపులో ఉన్న మలినాలు, తొలగిపోవడమే కాకుండా పేగులను సైతం శుభ్రం చేస్తాయని…

Read More

గ్యాస్ ట్రబుల్, కడుపు ఉబ్బరంతో అల్లాడిపోతున్నారా? ఇలా చేయండి..!!

 న్యూస్ ఇండియా24/7 హెల్త్ న్యూస్….  అల్లం రసం ద్వారా గ్యాస్ ట్రబుల్ సమస్య నుంచి బయటపడొచ్చు. అల్లం రసంలో కాస్త బెల్లం పొడిని కలుపుకుని తాగుతూ ఉంటే గ్యాస్ ట్రబుల్ తగ్గిపోతుంది. ధనియాలు కొన్ని ధనియాలు తీసుకోండి. అందులో కాస్త శొంఠి కలపండ చాలా మంది తరుచూ గ్యాస్ ట్రబుల్ సమస్యతో ఇబ్బందిపడుతుంటారు. సాధారణంగా మనం తినే ఫుడ్ జీర్ణమయ్యేటప్పుడు కొద్దిగా గాలి బయటకు పోదు. అది పేగుల్లో అలాగే ఉండిపోతుంది. దీంతో గ్యాస్ ట్రబుల్ సమస్య వస్తుంది. సమయానికి సరైన ఆహారం తీసుకోకుంటే ఈ సమస్య బారినపడుతుంటాం. మలబద్దకం వల్ల కూడా గ్యాస్‌ ట్రబుల్‌ వస్తూ ఉంటుంది. అయితే కొన్ని రకాల చిట్కాలు పాటిస్తే గ్యాస్ ట్రబుల్ సమస్య ఈజీగా తగ్గిపోతుంది. అల్లం అల్లం రసం ద్వారా గ్యాస్ ట్రబుల్ సమస్య నుంచి బయటపడొచ్చు. అల్లం…

Read More