అతి పెద్ద డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కాలనీ…

 న్యూస్ ఇండియా 24/7 నేషనల్ న్యూస్ నెట్వర్క్…  హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో కొల్లూరులో చేపట్టిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పనుల పురోగతిపై శనివారం రాష్ట్ర ప్రభుత్వ గృహ నిర్మాణ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ చిత్రా రామచంద్రన్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సుమారు రూ.1,355 కోట్ల వ్యయంతో 124 ఎకరాల విస్తీర్ణంలో 15,660 డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. ఈ కాలనీ… దేశంలోనే అతిపెద్ద డబుల్‌ బెడ్‌రూం గృహల కాలనీగా చిత్రా రామచంద్రన్‌ పేర్కొన్నారు. దాదాపు మున్సిపాలిటీగా ఉన్న ఈ కాలనీలో అంతర్గత రహదారులు, వీధి దీపాలు, మున్సిపల్‌ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్‌, పార్కులు, ప్లేగ్రౌండ్‌లు, పోలీసు స్టేషన్‌, పెట్రోల్‌ బంక్‌, విద్య సంస్థలు, కమ్యూనిటీ హాల్‌ తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయడం ద్వారా మొట్టమొదటి హౌజింగ్‌ కాలనీగా గుర్తిపు పొందిందన్నారు. ఈ గృహాల్లో…

Read More

కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన..

న్యూస్ ఇండియా24/7 నేషనల్ న్యూస్ నెట్వర్క్…విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర ప్రాంతంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్‌కు అనుకుని ఉపరితల ఆవర్తనం బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 3.1 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తువరకు కొనసాగుతుందని పేర్కొంది. నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల కోస్తాంధ్ర ప్రాంతంలో విస్తరంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలియజేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయన్నారు. సముద్రతీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని.. మత్స్యకారులు చేపల వేటకు సముద్రానికి వెళ్లద్దని హెచ్చరికలు జారీ చేశారు.

Read More

రూ. 5లక్షల లోపు ఇన్‌కమ్‌ట్యాక్స్‌ మినహాయింపు

న్యూస్ ఇండియా24/7 నేషనల్ న్యూస్ నెట్వర్క్…న్యూఢిల్లీ: బడ్జెట్లో అల్పాదాయ వర్గాలకు ఊరట కలిగింది. ఏడాదికి రూ. 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి ఆదాయపు పన్ను నుంచి మినహాయింపును కలిగించారు. రూ. 5 లక్షలపైన ఆదాయం ఉన్నవారు ఆదాయపు పన్ను కట్టాల్సి ఉంటుంది. ఇదే సమయంలో కోటీశ్వరులపై మరింత భారం మోపారు. రూ. 2 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు ఆదాయం ఉన్నవారికి 3 శాతం పన్నును పెంచారు. రూ. 5 కోట్ల పైన ఆదాయం ఉన్నవారికి పన్నును 7 శాతం పెంచారు. రూ.5 కోట్ల కంటే తక్కువ టర్నోవర్‌ ఉన్న ఆదాయపుపన్ను చెల్లింపుదారులు ఇకపై మూడు నెలలకోసారి జీఎస్టీ రిటర్నులు ఫైల్‌ చేయాలి. మరోవైపు రోడ్లు, మౌలికవసతుల కల్పన కోసం లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌ పై ఒక్క రూపాయి అదనపు ఎక్సైజ్‌ డ్యూటిని…

Read More

ఏపీ తహసీల్దార్ల సంఘం ఆవిర్భావం

న్యూస్ ఇండియా24/7 నేషనల్ న్యూస్ నెట్వర్క్… ఏపీ తహసీల్దార్ల సంఘం(ఏపీటీఏ) ఆవిర్భావ మైంది. తమ సమస్యలపై ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌(ఏపీఆర్‌ఎ్‌సఏ) సరైన కృషి చేయకపోవడంతో స్వతంత్ర సంఘం వైపుగా రాష్ట్రంలోని తహసీల్దార్లు అడుగులు వేశారు. మంగళవారం విజయవాడలోని ఒక హోటల్‌లో రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన తహసీల్దార్లు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం 100కు పైగా తహసీల్దార్లు హాజరయ్యారు. ఎన్నికల నేపథ్యంలో ఇతర జిల్లాలకు బదిలీలు చేసినా.. ఇప్పటికీ సొంత జిల్లాలకు పంపించకపోవటం, ఎన్నికల బడ్జెట్‌ మంజూరు కాకపోవడం వంటి అంశాలను సమావేశంలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా 20 మంది తహసీల్దార్లతో అడ్‌హక్‌ కమిటీని వేశారు.

Read More