తెలంగాణ లో….కొత్త అటవీ చట్టం సిద్ధం..!!

న్యూస్ ఇండియా24/7 న్యూస్ నెట్వర్క్….   –ప్రభుత్వానికి చేరిన చట్టం ముసాయిదా -షెడ్యూల్ 3లో టేకు, నల్లమద్ది, ఏగిస, చందనం చెట్లు -అటవీనేరాలకు 3 నుంచి 14 ఏండ్ల వరకు జైలు -రాష్ట్ర అటవీ చట్టం- 2019 సిద్ధమైంది. ముసాయిదాను ప్రభుత్వ ఆమోదం కోసం అటవీ అధికారులు పంపారు. ప్రస్తుతం ఈ ముసాయిదా న్యాయశాఖ పరిశీలనలో ఉన్నది. ఇకపై అనుమతి లేకుండా చెట్లు నరికినా.. అటవీ భూములను కబ్జా చేసినా శిక్ష తప్పదు. అటవీ నేరాలకు ఈ చట్టంలో కఠినశిక్షలను పొందుపరిచారు. అ త్యంత శ్రేష్టమైన టేకుతోపాటు కొన్ని అరుదైన వృక్షాలను షెడ్యూల్- 3లో చేర్చారు. ఇప్పటివరకు అమలులో ఉన్న 1962 తెలంగాణ ఫారెస్ట్ యాక్ట్‌ను పూర్తిగా మార్చి తెలంగాణ అటవీ చట్టం- 2019 తీసుకొచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి స్వీకరించిన చట్టానికి కొత్త రూపమిచ్చి.. ఫారెస్ట్ అఫెన్సెస్…

Read More

ఏజెన్సీల్లో అద్దె గర్భం దందా…అడవిలో అమ్మకానికి అమ్మతనం…!!

    ఉచ్చులో పెళ్లి కాని యువతులు ఆదివాసీలపై మధ్యవర్తుల వల 3 నుంచి 4 లక్షల దాకా ఒప్పందం పిల్లలు పుట్టని దంపతులతో ఒప్పందం చేసుకొని దళారులు గిరిజన ప్రాంతాల్లో వాలిపోతున్నారు. మగ దిక్కు లేని, నిరుపేద మహిళల కోసం, ఆర్థిక అవసరాల్లో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. వారితో ఒప్పందం కుదుర్చుకుని ఖమ్మం, విజయవాడ, హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. అక్కడ సరగసీ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు.       వాళ్లంతా అడవి బిడ్డలు. నిరక్షరాస్యులు. ఆర్థిక అవసరాల్లో చిక్కుకున్న నిరుపేద గిరిజనులు. అద్దె గర్భం (సరగసీ) ముఠా కన్ను ఇప్పుడు ఈ అడవి బిడ్డలపై పడింది. గిరిజన మహిళలు శారీరకంగా బలంగా ఉంటారనే అభిప్రాయమే ఇందుకు కారణం. ఆదివాసీ ప్రాంతాల్లో తిరుగుతూ.. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న మహిళలకు వల వేస్తున్నారు. అద్దె గర్భానికి ఒప్పిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో పెళ్లి కాని…

Read More

22 నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు

  న్యూస్ ఇండియా24/7 పొలిటికల్ న్యూస్ నెట్వర్క్….తెలంగాణలో శాసనసభా సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 22 ఉదయం 11:30 గంటలకు ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 19న కేబినెట్‌ను విస్తరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. తొలి విడతగా కేబినెట్‌లో 10 మందికి అవకాశం దక్కనున్నట్టు సమాచారం. శాసనసభ సమావేశాల తేదీ, సమయాన్ని పేర్కొంటూ ప్రభుత్వం నేడు నోటిఫికేషన్ జారీ చేసింది.

Read More

ప్రతీ శనివారం నాడు ఇలా చేస్తే….

న్యూస్ ఇండియా24/7 భక్తి న్యూస్ నెట్వర్క్….ఆంజనేయ స్వామిని ఎప్పుడు, ఎలా పూజించాలో తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవాలి. ఆరోగ్యానికి, శారీరక దృఢత్వానికి, స్థిరత్వానికి చిహ్న మూర్తి హనుమంతుడు. అలాంటి ఆంజనేయుడిని ప్రతిరోజూ పూజిస్తే శుభ ఫలితాలుంటాయి. అలానే వారాల్లో శనివారం, మాసంలో వచ్చే అమావాస్య నాడు హనుమంతుడిని కొలిచే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. హనుమంతుడిని పూజించడానికి స్వామివారి పటం ఎంచుకోండి. పువ్వులు, పండ్లు, బియ్యం, దీపం, మిఠాయిలు, మట్టికండ అవసరం. శనివారం రోజున గోధుమలు, పప్పు, బెల్లం, నెయ్యి, ఉప్పు, పసుపుకొమ్ములు, బంగాళాదుంపలు, ఏదైనా ఆకుపచ్చని కూరగాయల్ని బ్రాహ్మణులకు దానం చేయాలి.   హనుమంతుడి పటాన్ని లేదా విగ్రహాన్ని ఓ ప్రదేశంలో ఉంచి అలంకరించాలి. దీపం వెలిగించి పువ్వులు, బియ్యం సమర్పించి పూజ చేయాలి. ఇకపోతే.. హనుమంతుడికి సిందూరం అంటే మహాప్రీతి. సీతమ్మ తల్లిని నుదుటిపై…

Read More