పచ్చ మీడియా పతివ్రతలు…!!

న్యూస్ ఇండియా24/7 నేషనల్ న్యూస్ నెట్వర్క్…పచ్చ మీడియాకు ఇపుడు హఠాత్తుగా ప్రజాస్వామ్యం గుర్తుకు వచ్చింది. పార్టీ ఫిరాయింపులు గుర్తుకువచ్చాయి. ప్రజాస్వా మ్య విలువలు కూడా గుర్తుకొస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఫిరాయింపుల చట్టం వెలవెలపోతున్నదట. పార్టీ మార్పిడి నిరోధించడానికి గట్టి చట్టం రావాలట. ఇంకా చాలా చాలా రాసుకున్నా రు తమ పత్రికల్లో. సరే వారి పత్రిక వారిష్టం. ఎంతైనా రాసుకోవచ్చు. కానీ ఈ నీతులు రెండువందలకు పైగా సీట్లతో గెలిచిన ఎన్టీఆర్‌ను వెన్నుపోటుతో బాబు గద్దె దింపినపుడు ఎందుకు గుర్తుకు రాలేదనేది ప్రశ్న. అంతకు ముందు నాదెండ్ల ఎపిసోడ్‌ను వెన్నుపోటని..అన్యాయం సహించం అంతు తేలుస్తామని పతాక శీర్షికలతో రంకెలు వేసిన సదరు ప్రజాస్వామ్య ఉద్ధారకుడు.. బాబు కుట్ర సమయంలో ఎందుకు మౌనవ్రతం అవలంబించాడో చెప్పాలి. వాస్తవానికి అంతకు ముందు జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్ ముఖం చూసి రెండువందలకు పైగా…

Read More

సర్కారు చేతికి జనం నాడి!

న్యూస్ ఇండియా 24/7  నేషనల్ న్యూస్ నెట్వర్క్ – వైద్యఆరోగ్యశాఖ ఇంటింటి సర్వే  – 30 ఏండ్లు దాటిన వారికి ఆరోగ్య పరీక్షలు  – 11 రకాల వ్యాధులపై సమాచార సేకరణ  – డాటా ఆధారంగా ఉచిత వైద్య పరీక్షలు – వివరాలు వెబ్‌సైట్‌లో నమోదు  – హెల్త్‌ ప్రొఫైల్‌ పోర్టల్‌లో 43 అంశాలు న్యూస్ ఇండియా 24/7  నేషనల్ న్యూస్ నెట్వర్క్ – హైదరాబాద్‌ ప్రజల ఆరోగ్య సమగ్ర సమాచార సేకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) ఆధ్వర్యంలో ప్రభుత్వం నాన్‌ కమ్యూనికేబుల్‌ డిసీజెస్‌ (ఎన్‌సీ డీ) కార్యక్రమాన్ని గత నెల 20న ప్రారంభించింది. ఎన్‌సీడీ ఆధారంగా ప్రజల ఆరోగ్య వివరాలు ప్రభుత్వం నిక్షిప్తం చేయ నుంది. సర్వేలో ప్రజల ఆరోగ్య స్థితిగతులు ఎలా ఉన్నాయి.. ఎక్కువగా ఏయే జబ్బులతో బాధపడుతున్నారు.. దీర్ఘకాలిక, ప్రాణాంతక జబ్బులు ఏమైనా…

Read More

వాక్సిన్ వికటించి చిన్నారులకు అస్వస్థత.. ఒకరు మృతి

హైద్రాబాద్‌లోని నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్‌లో కలకలం రేగింది, చిన్నారులకు వేసిన వ్యాక్సిన్ వికటించడంతో 15 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఒకరు మృతి చెందగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్‌ లో నెలన్నర, రెండు మాసాల వయసున్న 90 మంది చిన్నారులకు వాక్సిన్ ఇచ్చారు. అయితే అందులో 15 మంది చిన్నారులు వ్యాక్సిన్ తీసుకొన్న తర్వాత అస్వస్థతకు గురయ్యారు. వెంటనే చికిత్స నిమిత్తం వారిని నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. చిన్నారులకు నిలోఫర్ ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. వాక్సిన్ తీసుకున్నవారిలో ఫైజాన్ అనే రెండు నెలల బాలుడు తీవ్ర అస్వస్థతకు గురై నిలోఫర్ ఆసుపత్రిలో మృతిచెందాడు.మరికొందరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. వారికి ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో నిలోఫర్…

Read More

శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణానికి ముహుర్తం ఖారారు!

న్యూస్ ఇండియా భక్తి 24/7 న్యూస్ నెట్వర్క్…భద్రాద్రి: ప్రముఖ పుణ్యకేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణానికి ఆలయ వేద పండితులు, ఆర్చకులు ముహుర్తం ఖరారు చేశారు. ఏప్రిల్‌ 6వ తేదీ నుండి 20 వరకు శ్రీ రామ నవిమి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 14న సీతారాముల కల్యాణం, 15న మహ పట్టాభిషేకం నిర్వహించనున్నారు. సీతారాముల కల్యాణం భక్తులు తిలకించేందుకు మిథిలా ప్రాంగణంలో సెక్టార్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా రూ.5 వేలు, రూ.2 వేలతోపాటు ఇతర టికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచారు. సీతారాముల కల్యాణాన్ని వీక్షించే భక్తులు ఈ రోజు నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లను కొనుగోలు చేసుకోవచ్చని ఆలయ అధికారులు తెలిపారు.

Read More