రాష్ట్ర స్థాయి రెస్లింగ్ పోటిలలో బంగారు పతకం సాధించిన …. లోహిత!!

THE NEWS INDIA(TNI 24NEWS NET WORK)…రేణిగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్ధిని రాష్ట్ర స్థాయి రెస్లింగ్ పోటిలలో బంగారు పతకం సాదించింది. రాష్ట్ర స్థాయిలో జరిగిన రెస్లింగ్ పోటిలలో రేణిగుంట పట్టణం వడ్డిమిట్టకు చెందిన లోహిత  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది.తిరుపతి లో శనివారం,ఆదివారం జరిగిన రాష్ట్ర స్థాయి పోటిలలో అండర్-19 లో 59కిలోల విభాగంలో లోహిత బంగారు పతకం సాదించింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విష్ణువర్ధిని,పిడి రేఖ మాట్లాడుతూ తమ విద్యార్ధినులు విద్యతో పాటు ఆటలలో కూడా రాష్ట్ర స్థాయి,జాతీయ స్థాయిలో తన పాఠశాలకు గుర్తింపు తెస్తునందుకు చాల ఆనందంగా ఉందని తెలిపారు. లోహిత రాష్ట్ర స్థాయి నుంచి వచ్చే నెల హర్యానా రాష్ట్రం లో జరిగే జాతీయ స్థాయి రెస్లింగ్ పోటిలలో పాల్గొనటానికి శిక్షణ పొందుతోంది…

Read More

మహాకూటమిలో చేరిన మరో పార్టీ

రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యంగా మహాకూటమి ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ కూటమిలో ఇప్పటికే కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ లు భాగస్వాములుగా ఉన్నాయి. తాజాగా ఈ కూటమిలోకి మరో పార్టీ వచ్చి చేరింది. ‘తెలంగాణ ఇంటి పార్టీ’ మహాకూటమితో చేతులు కలిపింది. ఈ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ నిన్న కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో భేటీ అయ్యారు. మహాకూటమికి మద్దతు పలుకుతున్నట్టు తెలిపారు. కూటమిలో చేరుతున్నందున తమ పార్టీకి కేటాయించాల్సిన స్థానాలపై చర్చించారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ, ఈ విషయాన్ని పార్టీ దృష్టికి తీసుకెళతామని సుధాకర్ కు హామీ ఇచ్చారు.

Read More

సీమాంధ్రుల… దారెటు….!!!

సీమాంధ్రుల… దారెటు….!!!  రాష్ట్రం విడిపోయిన తరువాత సీమాంధ్రుల పరిస్థితి అధోగతి పాలు అయింది, మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత  సీమాంధ్రుల పరిస్థితులను చక్కదిద్దేందుకు ఉమ్మడి రాష్ట్రంగా పది సంవత్సరాలు ఉండే విధంగా విభజన చట్టం చేశారు. దానికి బాధ్యునిగా రాష్ట్ర గవర్నర్ వ్యవహరిస్తారు. ప్రాంతాలుగా…విడిపోయి తెలుగు ప్రజలుగా కలిసి ఉందాం అంటే, “భాష యందు యాస “సమస్యగా మారింది. 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో సీమాంధ్ర ప్రజలు  హైదరాబాద్, రంగారెడ్డి మరియు ఎనిమిది జిల్లాల్లో సుమారుగా కోటి మంది వున్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత  మొట్టమొదటి గ్రేటర్ ఎలక్షన్లు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ” ప్రాంతాలు వేరైనా భాష ఒక్కటే” నినాదంతో ” సీమాంధ్రుల ఐక్యవేదిక “ భరోసా ఇచ్చి , 90% ఓటు బ్యాంకును టిఆర్ఎస్ ఖాతాలో జమ చేసి…

Read More

ఏకాగ్రతను దెబ్బతీసి గెలిచిన మారిన్: బాధగా ఉందన్న పీవీ సింధు

సిద్ధం కాకముందే మారిన్ సర్వీస్ లు తొలి గేమ్ లో చేసిన రెండు మూడు తప్పులే కొంపముంచాయి వచ్చే సంవత్సరం స్వర్ణం సాధిస్తానన్న తెలుగుతేజం షటిల్ కోర్టుపై చాలా వేగంగా కదులుతూ ఉండే కరోలినా మారిన్ చేతిలో వరల్డ్ బ్యాడ్మింటన్ ఫైనల్ పోరులో ఓడిపోయిన తెలుగుతేజం పీవీ సింధూ, ఈ ఓటమి తనకెంతో బాధను కలిగించిందని వ్యాఖ్యానించింది. అయితే, ప్రపంచ టాప్ క్రీడాకారిణులతో పోటీపడి పతకం గెలవడం తనకు సంతోషంగా ఉందని పేర్కొంది. ఫైనల్ పోరులో తనను మానసికంగా దెబ్బకొట్టేందుకు మారిన్ పన్నిన వ్యూహం ముందు తాను తలొగ్గడమే ఓటమికి కారణమైందని సింధూ వ్యాఖ్యానించింది. తాను సిద్ధం కాకుండానే మారిన్ సర్వీస్ లు చేసిందని, దానివల్ల తన ఏకాగ్రత దెబ్బతిందని చెప్పింది. కొన్ని పొరపాట్లు కూడా తనవైపు నుంచి జరిగాయని, తొలి గేమ్ లో ఆధిక్యంలో ఉండి…

Read More