ఇదొక ఉజ్వల ఘట్టం

-తెలుగు ప్రజలు ప్రేమానురాగాలతో నడిచేందుకు బీజం -గోదావరి జలాలు సంపూర్ణంగా వాడుకుందాం -చరిత్రలో నిలిచిపోయేలా జగన్ పాలించాలి -రెండు రాష్ర్టాల మధ్య ఖడ్గచాలనం కాదు.. కరచాలనం కావాలి -జగన్ ప్రమాణస్వీకారోత్సవంలో సీఎం కే చంద్రశేఖర్‌రావు అమరావతి, (న్యూస్ ఇండియా24/7 నేషనల్ న్యూస్ నెట్వర్క్) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకారం తెలుగు రాష్ర్టాల ప్రజల జీవనగమనంలో ఉజ్వల ఘట్టమని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అభివర్ణించారు. రెండు తెలుగు రాష్ర్టాల మధ్య ఇప్పుడు కావాల్సింది ఖడ్గచాలనం కాదని, కరచాలనమని చెప్పారు. కృష్ణా, గోదావరి జలాల విషయంలో పరస్పర సహకారంతో ముందుకు వెళ్తూ, ఉభయ రాష్ర్టాలు సంపూర్ణంగా నదీజలాలను వినియోగించుకోవాలని ఆకాంక్షించారు. గురువారం ఏపీ సీఎంగా ప్రమాణం స్వీకరించిన జగన్మోహన్‌రెడ్డికి కేసీఆర్ అభినందనలు తెలిపారు. జగన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన కేసీఆర్ మాట్లాడుతూ, అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రిగా…

Read More

కేంద్రమంత్రిగా అమిత్‌ షా ప్రమాణం..

భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అమిత్‌ షా కేంద్రమంత్రివర్గంలోకి వస్తారా? లేదా? అనే విషయంపై పలు రకాల ఊహాగానాలు షికారు చేసిన సంగతి తెలిసిందే. మొత్తానికి ఆ వార్తలకు తెరపడింది. కేంద్రమంత్రిగా అమిత్‌ షా ప్రమాణం చేయడంతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరనేది తేలాల్సి ఉంది. నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం చేసిన అనంతరం మొదట రాజ్‌నాథ్‌ సింగ్‌ కేంద్రమంత్రిగా ప్రమాణం చేయగా, ఆ తర్వాత వరుసగా అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీ, సదానంద గౌడ, నిర్మలాసీతారామన్‌ కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరందరి చేత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రమాణస్వీకారం చేయించారు.

Read More

పాదయాత్ర నుంచి.. సీఎం పీఠానికి

న్యూస్ ఇండియా24/7 నేషనల్ న్యూస్ నెట్వర్క్ ఏపీ రాజకీయాల్లో సంచలనం జగన్… కాంగ్రెస్‌ను ధిక్కరించి.. సొంత పార్టీ… చంద్రబాబుపై పోరాడి అధికారంలోకి..  జగన్! ఇప్పుడు ఈ పేరు దేశంలోనే ఒక సంచలనం! మొన్నటిదాకా.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తనయుడు! నేడు.. ఆ తండ్రి వారసత్వాన్ని స్వీకరించిన పాలకుడు! ఒక జాతీయ పార్టీని ఢీకొన్నా.. రాష్ట్ర విభజన తర్వాత ఒక సీనియర్ నాయకుడిని ఎదిరించి తన ఉనికిని చాటుకున్నా.. సాహసంతో మూడువేల కిలోమీటర్లకుపైగా రాష్ట్రంలో పాదయాత్ర చేసినా.. అది జగన్‌కే చెల్లింది! తొమ్మిదేండ్ల కష్టం.. ఫలితాన్నిచ్చింది. ఏపీ రెండో సీఎంగా ప్రమాణం స్వీకరించిన జగన్మోహన్‌రెడ్డి 1972 డిసెంబర్ 21న పులివెందులలో జన్మించారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, విజయమ్మల ఏకైక కుమారుడు. జగన్‌కు భార్య భారతి, ఇద్దరు కుమార్తెలు హర్షారెడ్డి, వర్షారెడ్డి ఉన్నారు. జగన్ విద్యాభ్యాసం పులివెందులలో, తదుపరి హైదరాబాద్…

Read More

ప్రభుత్వ శాఖలన్నీ ఇంజినీరింగ్ పనులు ఆపేయాలి: ఏపీ సీఎస్ ఆదేశం

న్యూస్ ఇండియా 24/7 నేషనల్ న్యూస్ నెట్వర్క్ ప్రభుత్వ శాఖల కార్యదర్శులకు నూతన మార్గదర్శకాలు అనాలోచిత నిర్ణయాలతో ఖజానాపై భారం పడిందన్న సీఎస్ ఇంజినీరింగ్ పనుల చెల్లింపులపై నూతన విధివిధానాలు ఏపీ కొత్త ముఖ్యమంత్రిగా జగన్ పదవీప్రమాణం చేసిన కొద్దిసేపట్లోనే అధికార యంత్రాంగంలో, పాలనా విధానాల్లో వేగవంతమైన మార్పులు కనిపించాయి. ఆర్థిక వనరులు లేనందున ప్రభుత్వ శాఖలన్నీ ఇంజినీరింగ్ పనులు నిలిపివేయాలని సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్ని శాఖల కార్యదర్శులను ఆదేశించారు. ఇంజినీరింగ్ పనుల కారణంగా ఖజానాపై పెనుభారం పడిందన్నారు. ప్రభుత్వ పనుల్లో నిధుల వ్యయం, బిల్లుల మంజూరుకు సంబంధించి స్పష్టతనిస్తూ సీఎస్ కొద్దిసేపటి క్రితం మెమో జారీచేశారు. ఎఫ్ఆర్ బీఎం పరిమితులను పట్టించుకోకుండా చేసిన పనులతో రాష్ట్రంపై ఆర్థికంగా భారం పడిందని సీఎస్ పేర్కొన్నారు. ముఖ్యంగా, ప్రాధాన్యతలను పట్టించుకోకుండా చేపట్టిన ప్రాజక్టు పనుల్ని సమీక్షించాల్సిన అవసరం…

Read More