రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’లో జూ.ఎన్టీఆర్ టీజర్‌పై అప్‌డేట్ ఇచ్చిన సినిమా యూనిట్!

Rajamouli 'RRR' movie unit updated on JNTR teaser!

‘బాహుబలి’ సినిమా తర్వాత దర్శకుడు రాజమౌళి రూపొందిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఇప్పటికే ‘భీమ్‌ ఫర్‌ రామరాజు’ టీజర్ విడుదలైన విషయం తెలిసిందే. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్‌ను ఈ సినిమా యూనిట్ ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఇక కొమరం భీమ్‌గా నటిస్తోన్న ఎన్టీఆర్‌కు సంబంధించిన టీజర్ ను ఈ నెల 22న విడుదల చేయనున్న ఆ సినిమా యూనిట్ ఇప్పటికే ప్రకటన చేసింది. దీని కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ టీజర్‌ను ఏయే భాషల్లో ఏయే యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా విడుదల చేస్తామన్న విషయాన్ని ఆ సినిమా యూనిట్ ఈ రోజు తెలిపింది. తెలుగులో డీవీవీ మూవీస్ యూట్యూబ్ ఛానెల్‌లో విడుదల చేస్తామని చెప్పింది. తమిళంలో జూనియర్ ఎన్టీఆర్ అఫిషియల్ యూట్యూబ్ లో, హిందీలో అజయ్ దేవగణ్ యూట్యూబ్ లో, కన్నడలో…

Read More

టాపర్ ను ఫెయిల్ చేసిన వైనం! నీట్ ఫలితాల్లో గందరగోళం..

All India topper declared as failed in NEET 2020 exam

ఎంబీబీఎస్, బీడీఎస్ కాలేజీల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్ ఫలితాల పట్ల దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టాపర్ గా నిలిచిన విద్యార్థిని ఫెయిల్ అయినట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. వివరాల్లోకి వెళ్తే, మృదుల్ రావత్ అనే విద్యార్థికి తొలుత ఫెయిల్ మార్కులు వచ్చాయి. అయితే ఆ తర్వాత ఓఎంఆర్ షీటును రీచెకింగ్ చేయిస్తే… ఎస్టీ కేటగిరీలో ఆలిండియా టాపర్ గా రావత్ నిలిచాడు. 17 ఏళ్ల రావత్ రాజస్థాన్ లోని మాధోపూర్ జిల్లా గంగాపూర్ కు చెందిన విద్యార్థి. అక్టోబర్ 16న నీట్ ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో రావత్ కు 720కి గాను 329 మార్కులు వచ్చినట్టు మార్కుల జాబితాలో ఉంది. ఆ తర్వాత రీచెక్ చేయించడంతో అతనికి 650 మార్కులు వచ్చినట్టు…

Read More

బాలీవుడ్ అనే పదం ఒక కాపీ.. దాన్ని తిరస్కరించండి: కంగన రనౌత్

ఇండియాలో చిత్ర పరిశ్రమ ఉంది బాలీవుడ్ అనే హాస్యాస్పదమైన పదం హాలీవుడ్ నుంచి వచ్చింది ఆ అవమానకరమైన పదాన్ని తిరస్కరించండి బాలీవుడ్ లో నెలకొన్న డ్రగ్స్ సంస్కృతి, నెపోటిజం తదితర అంశాలపై పోరాడుతున్న హీరోయిన్ కంగన రనౌత్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘మన దేశంలో కళాకారులున్నారు, బఫూన్లు ఉన్నారు, భారత చిత్ర పరిశ్రమ ఉంది, బాలీవుడ్ కూడా ఉంది. బాలీవుడ్ అనే హాస్యాస్పదమైన పదాన్ని హాలీవుడ్ నుంచి కాపీ చేశారు. అక్కడి నుంచి దొంగిలించారు. ఈ అవమానకరమైన పదాన్ని దయచేసి తిరస్కరించండి’ అని ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఆమె ‘తలైవి’ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాను దివంగత జయలలిత జీవితకథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. There are ARTISTS and there are BHANDS there is INDIAN FILM INDUSTRY and there is BOLLYWOOD…

Read More

ఇంద్రకీలాద్రికి మణిహారం… కనకదుర్గ వంతెనను ప్రారంభించనున్న గడ్కరీ, జగన్!

Maniharam to Indrakeeladri ... Gadkari to open Kanakadurga bridge, Jagan!

పై వంతెన నేడు జాతికి అంకితం మరో 61 ప్రాజెక్టుల శంకుస్థాపన కూడా 10 ప్రాజెక్టులు జాతికి అంకితం కనకదుర్గమ్మ కొలువైన బెజవాడ ఇంద్రకీలాద్రికి కంఠహారంగా రూపుదిద్దుకున్న ఫ్లై ఓవర్ నేడు జాతికి అంకితం కానుంది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో రూ. 15,591 కోట్లకు పైగా విలువైన పలు పనులకు శంకుస్థాపన జరుగనుంది. న్యూఢిల్లీ నుంచి కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ, తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ కనకదుర్గ పై వంతెన ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొననున్నారు. మరో 61 ప్రాజెక్టుల శంకుస్థాపనలతో పాటు, పూర్తయిన 10 ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. కాగా, విజయవాడలో ట్రాఫిక్ కష్టాలను తీర్చడానికి, ఈ వంతెన ప్రారంభం కావడం తప్పనిసరైన పరిస్థితుల్లో, తక్షణమే దీన్ని ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే పలుమార్లు వంతెన…

Read More