ఇంద్రకీలాద్రికి మణిహారం… కనకదుర్గ వంతెనను ప్రారంభించనున్న గడ్కరీ, జగన్!

Maniharam to Indrakeeladri ... Gadkari to open Kanakadurga bridge, Jagan!

పై వంతెన నేడు జాతికి అంకితం మరో 61 ప్రాజెక్టుల శంకుస్థాపన కూడా 10 ప్రాజెక్టులు జాతికి అంకితం కనకదుర్గమ్మ కొలువైన బెజవాడ ఇంద్రకీలాద్రికి కంఠహారంగా రూపుదిద్దుకున్న ఫ్లై ఓవర్ నేడు జాతికి అంకితం కానుంది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో రూ. 15,591 కోట్లకు పైగా విలువైన పలు పనులకు శంకుస్థాపన జరుగనుంది. న్యూఢిల్లీ నుంచి కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ, తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ కనకదుర్గ పై వంతెన ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొననున్నారు. మరో 61 ప్రాజెక్టుల శంకుస్థాపనలతో పాటు, పూర్తయిన 10 ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. కాగా, విజయవాడలో ట్రాఫిక్ కష్టాలను తీర్చడానికి, ఈ వంతెన ప్రారంభం కావడం తప్పనిసరైన పరిస్థితుల్లో, తక్షణమే దీన్ని ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే పలుమార్లు వంతెన…

Read More

కాబోయే భర్త గురించి ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకోకండి: పూరీ జగన్నాథ్

మహిళకు పర్‌ఫెక్ట్‌ తండ్రి, అమ్మ, డ్రైవర్‌, నర్సు దొరుకుతారేమో కానీ, పర్‌ఫెక్ట్‌ భర్త మాత్రం దొరకడు కోరుకున్నట్లే భర్త ఉండాలని అనుకుంటే సమస్యల్లో పడిపోతారు పెళ్లయిన ప్రతి అమ్మాయి ఏదో ఒక సమయంలో కన్నీరు పెట్టాల్సిందే పూరీ మ్యూజింగ్స్ పేరుతో అనేక అంశాలపై తన అభిప్రాయాల గురించి మాట్లాడుతోన్న సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ తాజాగా భర్తల గురించి మాట్లాడారు. మహిళకు పర్‌ఫెక్ట్‌ తండ్రి, అమ్మ, డ్రైవర్‌, నర్సు దొరుకుతారేమో కానీ, పర్‌ఫెక్ట్‌ భర్త మాత్రం దొరకడని ఆయన చెప్పారు. తనకు కాబోయే భర్త గురించి అనేక ఎక్స్ పెక్టేషన్లు పెట్టుకుని, తను కోరుకున్నట్లే ఉండాలని అనుకుంటే సమస్యల్లో పడిపోతారని ఆయన చెప్పారు. పెళ్లయిన ప్రతి అమ్మాయి ఏదో ఒక సమయంలో కన్నీరు పెట్టాల్సిందేనని తెలిపారు. అమ్మాయిలను వారి జీవితంలో చాలా మంది ఏడిపిస్తుంటారని, కానీ, అధికంగా…

Read More

తని ఒరువన్ దర్శకుడితో రామ్ చరణ్ పాన్ ఇండియా ఫిలిం?

ఇటీవలి కాలంలో తెలుగు సినిమా స్థాయి బాగా పెరిగింది. ‘బాహుబలి’ సినిమా నుంచి ఇది బాగా ఎక్కువైంది. తెలుగు స్టార్ హీరోల సినిమాలకు బాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ ఏర్పడడంతో పలువురు హీరోలు తమ సినిమాలను పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ప్రభాస్ సినిమాలన్నీ ఆ స్థాయిలోనే నిర్మాణం అవుతున్నాయి. ఆ తర్వాత మహేశ్, ఎన్టీఆర్ సినిమాలు కూడా మెల్లగా పాన్ ఇండియా సినిమాలుగా రూపాంతరం చెందుతున్నాయి. ఈ కోవలో మెగాస్టార్ వారసుడు రామ్ చరణ్ కూడా ఇకపై తన సినిమాలను పాన్ ఇండియా స్థాయి చిత్రాలుగా నిర్మాణం జరపడానికి సమాయత్తమవుతున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత తాను చేయబోయే సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఉండాలన్న ఉద్దేశంతో అలాంటి కథ కోసం, దానిని సరిగా డీల్ చేయగల దర్శకుడి కోసం ఆయన చూస్తున్నాడు. ఈ…

Read More

బాలికపై దొంగబాబా అత్యాచారం… ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం!

తెలుగు రాష్ట్రాల్లో దొంగబాబాల దారుణాలు ఎక్కువవుతున్నాయి. తాజాగా వైద్యం పేరుతో ఓ బాలికకు మాయమాటలు చెప్పి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు మరో దొంగబాబా. ఈ ఘటన నిజామాబాద్ లో చోటుచేసుకుంది. ఆమెపై దారుణం జరిగినట్టు తెలవడంతో దొంగబాబాపై బాధితురాలి తల్లిదండ్రులు దాడి చేసి, దేహశుద్ధి చేశారు. ఈ ఘటనపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీరియస్ అయ్యారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన కర్కోటకుడికి బుద్ధి వచ్చేలా చేయాలని అన్నారు. దొంగబాబాను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. మరోవైపు కవిత ఆదేశాలతో బాధితురాలిని నిజామాబాద్ నగర మేయర్ నీతూ కిరణ్, జడ్పీటీసీ సుమనా రెడ్డి పరామర్శించారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. మరో వైపు ఈ దారుణ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంఘటన మరోసారి చోటుచేసుకోకుండా దొంగబాబాపై కఠిన చర్యలు తీసుకోవాలని…

Read More