ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తరలింపును నిరసిస్తూ రైతులు చేపట్టిన ఉద్యమం నేటితో 400వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా గొల్లపూడి సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్ష చేపట్టేందుకు టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సిద్ధం కావడంతో పట్టణంలో మరోమారు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దేవినేని దీక్షకు అనుమతి లేదని పేర్కొంటూ.. పట్టణంతోపాటు ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కాగా, గొల్లపూడిలో నిన్న కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. మంత్రి కొడాలి నాని తనపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్ష చేపట్టాలని దేవినేని సిద్ధమయ్యారు. అయితే, ఆయనను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. Tags: Devineni Uma, Gollapudi, Amaravati, Farmers agitation
Read Moreరామతీర్థంలో ప్రతిష్ఠాపనకు సిద్ధమవుతున్న విగ్రహాలు.. నేటి సాయంత్రానికి తయారీ పూర్తి!
విజయనగరం జిల్లా రామతీర్థంలో దుండగుల చేతిలో ఇటీవల ధ్వంసమైన విగ్రహాల స్థానంలో ప్రతిష్ఠించేందుకు నూతన విగ్రహాలు రెడీ అవుతున్నాయి. విగ్రహాల తయారీ కోసం దేవాదాయ శాఖ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) విజ్ఞప్తి అందగా, కంచి నుంచి కృష్ణశిలను తెప్పించి ముగ్గురు స్థపతులతో విగ్రహాలను తయారుచేయిస్తున్నారు. శ్రీరాముడి విగ్రహం పీఠంతో కలిపి మూడున్నర అడుగుల ఎత్తు ఉండగా, సీతమ్మ, లక్ష్మణుల విగ్రహాలు పీఠంతో కలిపి మూడు అడుగుల పొడవుతో తీర్చిదిద్దుతున్నారు. నిజానికి విగ్రహాల తయారీకి 15 రోజులు పడుతుందని తొలుత అంచనా వేసినా, అంతకంటే ముందుగానే విగ్రహాలు రూపుదిద్దుకుంటున్నాయి. నేటి సాయంత్రానికే విగ్రహాల తయారీ పూర్తవుతుందని, 21న టీటీడీ శిల్ప తయారీ కేంద్రంలో పూజలు నిర్వహించిన అనంతరం రామతీర్థానికి తీసుకెళ్లి ప్రతిష్ఠించనున్నారనీ సమాచారం. Tags: Viziangaram, Ramatheertham, Lord Sri Rama, TTD
Read Moreహీరో విశ్వంత్పై కేసు నమోదు: కార్లను తక్కువ ధరకు ఇప్పిస్తానంటూ మోసం..
టాలీవుడ్ నటుడు విశ్వంత్పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. అతి తక్కువ ధరకే కార్లను ఇప్పిస్తానంటూ పలువురిని మోసం చేసినట్టు అతడిపై అభియోగాలు నమోదయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. విశ్వంత్ పూర్తిపేరు విశ్వనాథ్. సామర్లకోటకు చెందిన విశ్వంత్.. అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాడు. 2015లో దిల్రాజు నిర్మించిన ‘కేరింత’ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టాడు. గతేడాది విడుదలైన ‘ఓ పిట్టకథ’ సినిమాలోనూ విశ్వంత్ నటించాడు. Tags: Tollywood actor, Vishwanth, Actor Cheating case, Banjara Hills
Read Moreజీహెచ్ఎంసీ ఎన్నికల బరిలో 1,121 మంది అభ్యర్థులు
జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ పర్వం నిన్న మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. దీంతో చివరగా ‘గ్రేటర్’ బరిలో నిలిచిన అభ్యర్థుల వివరాలను ఎన్నికల అధికారులు ప్రకటించారు. మొత్తం 2,900 మందికిపైగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, స్క్రూటినీ, ఉపసంహరణ అనంతరం 1,121 మంది అభ్యర్థులు పోటీలో నిలిచినట్టు అధికారులు తెలిపారు. అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దాదాపుగా మొత్తం 150 డివిజన్లలోనూ తమ అభ్యర్థులను బరిలో నిలిపాయి. టీడీపీ నుంచి 105 మంది, ఎంఐఎం నుంచి 50 మంది పోటీలో ఉండగా, ఇతర పార్టీలు, స్వతంత్రులు 500 మందికిపైగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. Tags: GHMC Elections, Hyderabad, TRS Congress, BJP TDP
Read More